
అయితే ఇప్పుడు ముగ్గురు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడు ప్రభాస్ అనే న్యూస్ తెరపైకి వచ్చింది . దానికి కారణం సినిమాలో ఐటెం సాంగ్ పెట్టేసారు. ఐటమ్ సాంగ్ కోసం ఒక స్పెషల్ బ్యూటీ ని సైతం అప్రోచ్ అయ్యి ఫైనలైజ్ చేశారట. ఆమె మరి ఎవరో కాదు "కరీనాకపూర్". బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ బ్యూటిగా పాపులారిటీ సంపాదించుకున్న హాట్ ఫిగర్ . అయితే కరీనాకపూర్ ని స్పెషల్ సాంగ్ లో చూస్ చేసుకోవడం పట్ల కొంతమంది రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .
ఆమె ఆంటీ మరెందుకు ప్రభాస్ సినిమాలో చూస్ చేసుకున్నారు..? అని మండిపడుతున్నారు . మరికొందరు మాత్రం ప్రభాస్ పక్కన కరీన్ వెరీ రేర్ కాంబో అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ తన కెరియర్ లో ఇద్దరు పిల్లల తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అది కూడా ఒక ఐటమ్ సాంగ్ లో.. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి కనీ విని ఎరుగని బిగ్ సర్ప్రైజ్ అంటూ కొంతమంది ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ కరీనాకపూర్ ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే కొంతమంది కరీనాకపూర్ కాకుండా ఈ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని చూస్ చూసుకుంటే బాగుండేది అంటూ మాట్లాడుకుంటున్నారు. గతంలో కాజల్ - ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమాలు ఎంత మంచి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే..!!