
ఒకానొక టైమ్‌లో సిల్క్ పాట లేకపోతే సినిమా ఫ్లాప్ అన్నంతగా ఇండస్ట్రీలో అభిప్రాయం ఉండేది. నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేకంగా ఐటెం సాంగ్స్ ప్లాన్ చేసేవారు. అగ్ర హీరోల సైతం సిల్క్ డేట్స్ కోసం ఎదురుచూసేవారు. సిల్క్ స్మిత సినిమాలో ఉందని తెలిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్స్ పరుగులు పెట్టేవారు. స్క్రీన్ పై సిల్క్ కనిపిస్తే చాలు థియేటర్స్ లో జనాలు ఊగిపోయేవారు. సినిమా విజయానికి అప్పట్లో సిల్క్ స్మిత ఓ లక్కీ ఛామ్ గా ఉండేది.
ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో సిల్క్ అమితమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే తన క్రేజ్ కు తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా సిల్క్ స్మిత భారీగా ఛార్జ్ చేసేది. పారితోషిక విషయంలో అగ్ర తారలను కూడా డామినేట్ చేసేది. ఒక్కరోజు షూటింగ్ లో పాల్గొంటే లక్ష రూపాయలు ఆమెకు ముట్టచెప్పాల్సిందే. అంత డిమాండ్ ఉన్న సిల్క్ స్మిత్ కు ఒక వింత అలవాటు కూడా ఉండేదట. ఇండస్ట్రీలో సిల్క్ బాగానే సంపాదించింది.
అయితే నైట్ అయ్యిందంటే చాలు తాను సంపాదించిన డబ్బును బెడ్ పై పరిచి.. కరెన్సీ నోట్లపై సిల్క్ నిద్రపోయేదట. ఈ విషయాన్ని గతంలో సీనియర్ నటి, డాన్సర్ మరియు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అప్పట్లో నిజంగా సిల్క్ స్మితకు ఇటువంటి అలవాటు ఉండేదని తెలిసి జనాలు మతిపోగొట్టుకున్నారు. కాగా, చాలామంది సిల్క్ స్మితను కేవలం గ్లామర్ స్టార్ గా మాత్రమే చూసేవారు. కానీ ఆమెలో నటన శక్తి, కష్టపడే తత్వం, కలల పట్ల ఆమెకున్న తపన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.