
రీసెంట్ గానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "కుబేర" సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి నటించి మెప్పించాడు. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేసిన చాలా మంది పాజిటివ్గా మాట్లాడారు . అక్కినేని నాగార్జున పర్ఫామెన్స్ చాలా బాగుంది అని.. ఆయన వేసిన డేరింగ్ స్టెప్ ఇంకా ఇంకా బాగుంది అంటూ పొగిడేసారు. అయితే మరొకసారి నాగార్జున నటించబోతున్నాడు విలన్ షేడ్స్ లో అన్న విషయం వైరల్ అవుతుంది. అది కూడా మన తెలుగు హీరో సినిమాలో..
ఎస్ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటించబోయే సినిమాలో విలన్ షేడ్స్ లో ఉన్న ఒక సెంటిమెంట్ పాత్ర కోసం నాగార్జున అనుకుంటున్నారట మూవీ మేకర్స్. కుబేర సినిమా చూసిన తర్వాతే ఈ ఆలోచన తట్టిందట. అంతకుముందు ఈ పాత్ర కోసం ఆది పినిశెట్టిని అనుకున్నారట . ఆ తర్వాత పాత్రలో కొన్ని మార్పులు చేర్పులు చేసి నాగార్జున అయితే ఇంకా బాగుంటుంది అంటూ సుకుమార్ ఆలోచిస్తున్నారట. నాగార్జునకి కూడా ఈ స్టోరీ వివరించగా ఆయన కూడా పాజిటివ్ గాని స్పందించినట్లు తెలుస్తుంది . ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నాగార్జున ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయినట్లే . రామ్ చరణ్ సినిమాలో నెగిటివ్స్ పాత్రలో నాగార్జున నా..? ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు . చూడాలి మరి ఈ కాంబో సెట్ అవుతుందో..? లేదో..? ప్రెసెంట్ రాంచరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు..!