మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తాజాగా ఉప్పుకప్పురంబు సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ ముగించాము అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది కీర్తి.  అయితే ఈ సినిమా డైరెక్ట్ గా థియేటర్లో కాకుండా ఓటీటి లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఉప్పుకప్పురంబు మూవీలో కీర్తి సురేష్ సుహాస్ లు నటించారు. అలా ఫస్ట్ టైం ఓ కమెడియన్ తో కీర్తి సురేష్ నటించడం ఆశ్చర్యించదగ్గ విషయమే కానీ సుహాస్ ఎన్నో డిఫరెంట్ కథాంశాలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. అలాగే కథపై కూడా నమ్మకం ఉంటేనే కీర్తి సురేష్ ఈ సినిమాకి ఒప్పుకుందని చాలా మంది భావిస్తున్నారు.ఈ విషయం పక్కన పెడితే తాజాగా కీర్తి సురేష్ ఉప్పుకప్పురంబు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.మళ్లీ లాక్ డౌన్ వస్తే నేను ఆ హీరో తో కలిసి ఉంటానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

 మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే నాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్,నాని కాంబినేషన్లో నేను లోకల్,దసరా వంటి రెండు సినిమాలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలో నాని కి,కీర్తి సురేష్ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే తాజాగా ఉప్పుకప్పురంబు మూవీ ప్రమోషన్స్ లో మళ్ళీ లాక్ డౌన్ పడితే నేను నాని ఫ్యామిలీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.నాని,నాని భార్య అంజనా, నాని కొడుకు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం.వీరితో కలిసి టైం స్పెండ్ చేయడం అనేది నాకు ఎంతో ఇష్టం. అందుకే మళ్లీ లాక్ డౌన్ గనుక వస్తే నాని ఫ్యామిలీతో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను నాని నాకు మంచి ఫ్రెండ్ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.అయితే కీర్తి సురేష్ మాటలపై చాలామంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.

ఎందుకంటే అనుమానాలను నిజం చేస్తూ కీర్తి సురేష్హీరో ఫ్యామిలీతో కలిసి ఉంటానని చెప్పింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ అనుమానాలు ఏంటంటే..కీర్తి సురేష్ కి నానికి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుందని గతంలో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.నేను లోకల్ మూవీ రిలీజ్ అయిన సమయంలోనే నాని కీర్తి సురేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.అయితే ఆ వార్తలను నిజం చేసేలా కీర్తి సురేష్ తాజాగా నాని ఫ్యామిలీతో కలిసి ఉంటానని మాట్లాడటం చాలామందిని షాకింగ్ కి గురి చేసింది. అంతేకాదు పెళ్లయిన హీరోయిన్ భర్తతో అత్తమామలతో కలిసి ఉంటానని అనకుండా హీరో ఫ్యామిలీతో కలిసి ఉండాలని మాట్లాడడం ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: