టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన వరుస పెట్టి సినిమాలను నిర్మించడం , అలాగే అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడం చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ కి అత్యంత ప్రమాదంగా మారిన వాటిలో పైరసీ ఒకటి. పైరసీ అనేది అంతం అయితే సినిమా ఇండస్ట్రీ మరింత అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది అని అనేక మంది అనేక సందర్భాలలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దానితో చాలా మంది హీరోలు , దర్శకులు , నిర్మాతలు అనేక మంది సినిమా ఇండస్ట్రీ కి పెద్ద ప్రమాదం పైరసీ. దానిని వీలైనంత అరికట్టకపోతే సినిమా ఇండస్ట్రీ మనగాడ కష్టమవుతుంది. అని అనేక మంది అనేక సందర్భాలలో చెప్పారు. ఇకపోతే తాజాగా దిల్ రాజు "తమ్ముడు" అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ , సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఈ రోజు అనగా జులై 4 వ తేదీన థియేటర్లలో  విడుదల కానుంది. ఇకపోతే తాజాగా పైరసీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... సినీ పరిశ్రమలో పైరసీ ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు , ఇందు కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తాము అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తాము అని కూడా ఆయన చెప్పారు. అవసరమైతే కొత్త నిబంధనలను కూడా రూపొందిస్తాము అని , షూటింగ్లకు  ఆన్లైన్ లో అనుమతుల ప్రాసెస్ తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు చర్యలు తీసుకుంటాం అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇకపోతే తమ్ముడు మూవీ తో దిల్ రాజుకు ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: