పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరో గా నటించాడు. నీది అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... జ్యోతి కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ ని ఏ ఏం రత్నం నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో దీనికి అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ కూడా దక్కాయి.

పవన్ ప్రస్తుతం ఓజి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి  వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పవన్ సన్నివేశాలు చిత్రీకరణ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ యొక్క ఫస్టాఫ్ కాపీ రెడీ అయినట్లు సమాచారం.

దానితో పవన్ కళ్యాణ్ తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని చూసినట్లు , చూసి కేవలం కొన్ని కొన్ని మార్పులు , చేర్పులను సూచించినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా ఫస్ట్ అఫ్ అదిరిపోయినట్లు , దానితో పవన్ కళ్యాణ్ ఫుల్ సాటిస్ఫై అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉత్సద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ విడుదలపై ఇంకా పెద్దగా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk