
అలాగే సుమంత్ కమలిని ముఖర్జీల నటన అభినయం సినిమాకే హైలెట్గా నిలుస్తుంది .. అలాగే పాటలు కూడా ఎంతో వినుసంపుగా అనిపిస్తాయి . ప్రధానంగా ఈ సినిమాలోని చాలా భాగం గోదావరి నది పాపికొండలు ప్రాంతంలోనే తెరకెక్కించారు .. అందుకే ఈ సినిమాను చూస్తే దాదాపు గోదావరి నదిని చూసిన ఫీలింగ్ అందరిలో కలుగుతుంది .. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన గోదావరి సినిమాకు సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం , బెస్ట్ డైరెక్టర్ ఇలా ఐదు విభాగాలు నంది అవార్డులు కూడా వచ్చాయి . అయితే గతంలో పలువురు స్టార్ హీరోలు గోదావరి సినిమాను చేతులారా వదులు కొన్నారని వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , గోపీచంద్ , రవితేజలు కూడా ఈ సినిమాను వదులుకున్నారని ప్రచారం కూడా వచ్చింది ..
అయితే ఇప్పుడు తాజాగా కుబేర సినిమా ప్రమోషన్లో భాగంగా శేఖర్ కమ్ముల దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు .. ముందుగా ఈ సినిమా కోసం మహేష్ బాబుని అనుకున్నామని, అయితే ఆ సమయంలో ఆయన్ను కలవలేదని శేఖర్ చెప్పుకొచ్చారు . అలాగే ఈ సినిమా కోసం మరో హీరో సిద్ధార్థ్ ను కూడా కలిశారట శేఖర్ .. అయితే ఈ సినిమా స్టోరీ మొత్తం హీరోయిన్ ప్రధానంగా సాగుతుందన్న ఒక చిన్న రీజన్ తో ఈ సినిమాకు సిద్ధార్థ్ నో చెప్పారట .. అలాగే చివరగా అక్కినేని హీరో సుమంత్ గోదావరి సినిమాలో హీరోగా కన్ఫర్మ్ అయ్యారు .. మూవీలో రామ్ క్యారెక్టర్ లో ఎంత అద్భుతంగా నటించి విమర్శకులు దగ్గర నుంచి ప్రశంసలు అందుకుని తన కెరియర్ లోని గొప్ప సినిమాగా గోదావరిని నిలుపుకున్నారు.