
మంత్రి రోజా దానిపై తీవ్రంగా విరుచుపడింది . రీసెంట్ గా ఆ నిందలపై రియాక్ట్ అయ్యింది రోజ. "తన వల్ల సాయం పొందిన అందరూ తనకి కృతజ్ఞత చూపిస్తున్నారు అని ఒక వ్యక్తి తప్ప" అంటూ సంచలన కామెంట్స్ చేసింది . "నేను టికెట్లు అమ్ముకున్నానని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు.. పైన దేవుడు ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టడు.. నేను దేవున్ని గట్టిగా నమ్ముతాను. ఆ భగవంతునిపై ప్రమాణం చేసి చెబుతున్న నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదు.. అసలు నాకు టికెట్ అమ్ముకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ..? ఉన్న మంచి పేర్లు నేనెందుకు చెడగొట్టుకుంటాను ..? టికెట్ అమ్ముకుంటే నాకు ఎంత లాభం వస్తుంది..? నా ఆస్తి , నా రేంజ్ , నా స్టేటస్ ఏంటో అందరికీ తెలిసిందేగా..
ఒక్క షో చేసిన నాకు చాలా డబ్బులు వస్తాయి అది అందరికీ తెలుసు. నేను సంపాదించేదంతా వైట్ మని.. అలాంటిది దర్శనం టికెట్ అమ్మితే నాకు డబ్బులు ఎంత వస్తాయి చెప్పండి..? ఎంత లాభం వెనకేసుకుంటాను..?? ఎన్ని కోట్లు కూడ బెట్టుకుంటాను.. సినిమా వాళ్లు కానీ .. టీవీ వాళ్ళు కానీ .. నాకు పరిచయం ఉన్న ఎవ్వరు ఫోన్ చేసిన నేనే మాట్లాడతా .. దర్శనం టికెట్ కావాలి అంటే నేనే చేయించేదాన్ని.. ఎవరికైనా సరే ఫోన్ చేసి అడగండి.. రోజా మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా అని .. మీరే అడగండి .. వాళ్ళు ఏం చెప్తారో మీకే తెలుస్తుంది.
మన దగ్గర పని చేసే వాళ్లకు మనం డబ్బు సహాయం చేయడం కన్నా కూడా వాళ్లకు అవసరమైన సహాయం చేయడం చాలా ఇంపార్టెంట్ .. మా దగ్గర పనిచేసే వారు డబ్బులు తీసుకోరు. కృతజ్ఞతతో చేస్తారు. అలాంటి వాళ్లకు నేను ఇచ్చే సహాయం ఇది. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూడాలి అనుకుంటారు. కొంచెం సేపు తనివి తీరా వెంకటేశ్వర స్వామిని చూస్తే బాగుంటుంది అని అనుకుంటారు . అలాంటి వాళ్ళకి చిన్న సహాయం చేశాను . అది తప్పా..? నేరమా..? నాపై ఇలాంటి తప్పుడు నిందలు వేస్తారా..? అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది . అంతేకాదు ఏ దేవుడి మీద ప్రమాణమైన చేసి చెప్తాను.. తిరుమలకు వచ్చి చేయమంటే చేస్తా .. లేదంటే ప్రేక్షకుల మందు చేయమన్నా చేస్తా ..కాశీకి పోయిన శ్రీశైలం పోయిన ఎక్కడికి పోయినా నా అనే వాళ్లందరికీ మొత్తం నేనే ఖర్చులు పెట్టుకుంటా ..నాకు అదో ఇష్టం.. సంతోషం అంతే. వెంకటేశ్వర స్వామి పై ఒట్టేసిచెబుతున్నా నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదు.. నేను డబ్బులు కోసం ఆశపడే దాన్ని కాదు అంటూ స్ట్రాంగ్ గా ఇచ్చి పడేసింది రోజా ". దీంతో సోషల్ మీడియాలో మరొకసారి రోజా ని ఫైర్ బ్రాండ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!