మొగలిరేకులు సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు. ఒకప్పుడు మొగలిరేకులు సీరియల్ కి ఎంతటి క్రేజ్ ఉండేదంటే అమ్మలక్కలందరూ సీరియల్ టైం వచ్చేసరికి ఎలాంటి పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీకే అంకితం అయ్యేవారు. అలా చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ అప్పటి ప్రేక్షకులను బాగా అలరించాయి.ఇక మొగలిరేకులు సీరియల్ ని ఇప్పటికి కూడా ఓ ప్రముఖ ఛానల్లో మళ్ళీ ప్రసారం చేస్తున్నారు.ఇప్పటికి కూడా దానికి ఆదరణ తగ్గడం లేదు.అయితే అలాంటి మొగలిరేకులు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులలో ఆర్కే సాగర్ ఒకరు.. ఈయన సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి ఆర్కే సాగర్ నటించిన తాజా మూవీ ది 100..ఈ సినిమా జూలై 11న విడుదలకు సిద్ధంగా ఉండడంతో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

 ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో నటించడం ఒక చెత్త ఇన్సిడెంట్.. ఈ సినిమా తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి తిట్టారు. అయితే ఈ సినిమాలో మొదట డైరెక్టర్ మీరు సెకండ్ లీడ్ అని చెప్పారు.కానీ తీరా షూటింగ్ కి వెళ్తే సెకండ్ లీడ్ అని నాకనిపించలేదు. వెంటనే అందులో నుండి నన్ను తొలగించమని చెప్పాను.కానీ అక్కడక్కడ డైరెక్టర్ ఆ సీన్స్ అలాగే వదిలేసారు. దాంతో ఈ సినిమా తర్వాత నాకు చాలామంది ప్రముఖులు ఫోన్ చేసి తిట్టారు.ఇక ఈ సినిమాల్లో నటించడం ఒక చెత్త ఇన్సిడెంట్ అని నా అభిప్రాయం.అలాగే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో మొదట అవకాశం నాకే వచ్చింది.సుకుమార్ నా దగ్గరికి వచ్చి స్వయంగా ఈ విషయాలు చెప్పారు.

కానీ నాకు అప్పటికే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సమయంలో ఎదురైనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నటించను సార్ అని మొహం మీదే చెప్పేశాను. కానీ ఆ తర్వాత సుకుమార్ అలాంటిదేమీ లేదని ఎంత చెప్పినా వినలేదు.ఆ తర్వాత ఆది పినిశెట్టి కి ఈ కథ చెప్పారు. మొదట ఆయన కూడా ఈ కథకి నో చెప్పారు. దాంతో ఈ విషయం తెలిసి పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ కాబట్టి కథ కూడా బాగుందని నేను చేయడానికి వచ్చాను. కానీ అదే సమయంలో ఆది పినిశెట్టి కూడా సుకుమార్ గారికి ఫోన్ చేసి సినిమా చేస్తానని చెప్పారట.దాంతో ఆది పినిశెట్టిని తీసుకొని నన్ను పక్కన పెట్టేసారు. అలా రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది అంటూ ఆర్కే సాగర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: