
ఈ సినిమా ఎప్పటికీ నితిన్ మర్చిపోలేడు . ఈ సినిమా తర్వాతే దిల్ రాజు ఆయన పేరు మార్చుకున్నాడు. టాలీవుడ్ లో ఎంతోమంది గొప్పనట్లు ఉన్నారు . వాళ్ళల్లో ఒకరు నితిన్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. "జయం" సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మంచి హిట్ అందుకున్నాడు. ఈ మధ్యకాలంలోనే హిట్ అందుకోవడమే మానేశాడు . ఈ విషయం పక్కన పెడితే "దిల్" సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరు . అందులో కొంతమంది చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు . వారు ఎవరు..? ఎలా మరణించారు..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
చలపతి: దిల్ సినిమాలో నితిన్ పాత్రకు తండ్రిగా నటించాడు. ఈయన ఈమధ్య కాలంలోనే మరణించారు .
వేణుమాధవ్: దిల్ సినిమాలో హీరో కాకుండా ఇంకో పాత్ర హైలెట్ అయింది అనేది ఏదైన ఉంది అంటే అది వేణు మాధవ్ పాత్రే. ఈ సినిమాలో కీలకపాత్రలో నటించాడు . చలపతిరావు - వేణుమాధవ్ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ఇప్పటికి చూసిన కడుపుబ్బ నవ్వుకుంటాము. వేణుమాధవ్ 2019 సెప్టెంబర్ లో మరణించారు. ఆయనకు 49 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు .
ఆహుతి ప్రసాద్:ఆహుతి ప్రసాద్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించారు. 60 ఏళ్ళు రాకుండా చిన్న వయసులోనే మరణించారు . 2015 జనవరి 4 , 57 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు .
ఎమ్మెస్ నారాయణ: దిల్ సినిమాలో నటించిన మరొక స్టార్ ఎమ్మెస్ నారాయణ . లెక్చరర్ పాత్రలో నటించి గొప్ప నటుడు అయ్యాడు. ఆయన బాడీ లాగ్వేంజ్ ఈ సినిమా కి హైలెట్ గా మారింది . జనవరి 23న 2015 ..63 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.
రాజన్ పి దేవ్: ఈ సినిమాలో హీరోయిన్ కి తాత పాత్రలో కనిపించాడు . అంతకు ముందు కూడా ఆయన ఎన్నో సినిమాలల్లో నటించాడు . మరి ముఖ్యంగా "ఆది" సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అందరికీ హైలెట్గా నిలిచింది . 2009లో అనారోగ్య కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఆయన. 58 ఏళ్ల వయసులోనే మరణించడం అందరికీ షాకింగ్ గా అనిపించింది..!!