
గ్లిజరిన్ లేకుండా బన్నీ కన్నీళ్లు పెట్టుకొని నటించిన సినిమా ఇదే.. ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది..!

ఈ సినిమాతో కచ్చితంగా తన పేరుకి ఉన్న పాపులారిటి ఒకటి రెండు కాదు ఏకంగా 10 రెట్లు ఎక్కువగా సంపాదించుకునేస్తాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇలాంటి మూమెంట్లోనే బన్నీకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. గ్లిజరిన్ లేకుండానే అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకుని నటించిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరో కానీ హీరోయిన్ కానీ తెరపై కనిపించే యాక్టర్స్ కానీ గ్లిజరిన్ లేకుండా ఏడవలేరు .
రియల్ గా ఏడ్చేది మాత్రం కొందరే. ఎవరో కొందరు మాత్రమే అలా నాచురల్ గా ఏడ్చినట్లు నటిస్తారు. అయితే అల్లు అర్జున్ తన కెరీర్ లో చాలా సినిమాలల్లో నటించారు. కొన్ని సీన్స్ లో గ్లిజరిన్ తీసుకుని కూడా నటించారు. కానీ ఒకే ఒక్క సినిమా కోసం గ్లిజరిన్ తీసుకోకుండానే చేశారట . ఆ సినిమా మరేదో కాదు.." వేదం ". క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ ..అనుష్క ..దీక్ష సేథ్ కూడా నటించారు . ఈ సినిమా బిగ్ హిట్ అవుతుంది అని ఆశపడ్డారు . కానీ అవ్వలేదు. ఈ సినిమాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ..కాన్సెప్ట్ ప్రకారం కొత్తగా ఉన్న జనాలు మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయారు . ఈ సినిమాలోని సీన్స్ కోసం అల్లు అర్జున్ గ్లిజరిన్ అస్సలు వాడలేదట. నేచురల్ గానే నటించారట. అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయ్యింది.