వెండితెరపై కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేసే టాలీవుడ్ హీరోయిన్స్ లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తూ నెట్టింట ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మరోసారి స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించింది.
వైట్ అండ్ వైట్ బికినీలో ఒంపు సొంపులను చూపిస్తూ బీభత్సం సృష్టించింది. ఓవైపు థైస్ అందాలు.. మ‌రోవైపు మ‌త్తెక్కించే చూపుల‌తో ప్ర‌గ్యా మిస్మ‌రైజ్ చేసింది. అయితే గ్లామ‌ర్ షోలో ప్రగ్యా జైస్వాల్‌ ఇంతలా రెచ్చిపోయేది సినిమా అవకాశాల కోసమే అని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభించి దశాబ్దం పూర్తయిన.. సరైన స్టార్డ‌మ్ మాత్రం తక్కించుకోలేకపోయింది. 2018 తర్వాత కెరీర్ క్లోజ్ అనుకుంటున్న‌ తరుణంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ `అఖండ` మూవీతో ఆమెకు బిగ్ హిట్ ఇచ్చి నిల‌బెట్టారు. కానీ ఆ తర్వాత కూడా ఆమెకు అంత‌గా అవ‌కాశాలు రాలేదు.
టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్ర‌గ్యా వైపు క‌న్నెత్తి చూడలేదు. ఇక మళ్ళీ బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్‌`తోనే ప్ర‌గ్యా వెండితెరపై మెరిసింది.
ప్రస్తుతం బాలకృష్ణకు జోడిగా `అఖండ 2` సినిమాలో యాక్ట్‌ చేస్తుంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా ద‌స‌రా పండుగ కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల కాబోతుంది.
అలాగే మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ తో క‌లిసి `టైసన్ నాయుడు` అనే మూవీ చేస్తుంది. మరి ఈ రెండు చిత్రాలు ప్ర‌గ్యా జైస్వాల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? ఎటువంటి అవకాశాలు తెచ్చిపెడతాయి? అనేది చూడాలి.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: