సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు చేశారు.ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో మురారి, రాజకుమారుడు,అతడు,ఒక్కడు, పోకిరి, దూకుడు,సరిలేరు నీకెవ్వరు, బిజినెస్ మాన్, ఖలేజా, శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను,మహర్షి వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నింటిలో మహేష్ బాబుకు కొన్ని ప్రత్యేకమైన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే మహేష్ బాబు ఓ డైరెక్టర్ చేసిన పనికి షూటింగ్ సెట్ నుండి అలిగి వెళ్లిపోయారట.అదేంటంటే.. డైరెక్టర్ షూటింగ్లో భాగంగా హీరోయిన్ ఎంగిలి తాగమని మహేష్ బాబు కి చెప్పారట. ఆ విషయం వినగానే మహేష్ బాబు చిర్రెత్తుకుపోయి ఛీ ఛీ ఆ హీరోయిన్ ఎంగిలి నేను తాగడం ఏంటి అంటూ షూటింగ్ సెట్లో నుండి అలిగి ఇంటికి వెళ్లిపోయారట. 

ఇక ఆ సినిమా షూటింగ్ ఏంటి అనే వివరాలు చూస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు రాఘవేంద్రరావు డైరెక్షన్లో రాజకుమారుడు మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా ప్రీతిజింతా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఓ సన్నివేశంలో ప్రీతిజింతా తాగిన కూల్ డ్రింక్ నే మహేష్ బాబు కూడా తాగాలి.దాంతో ప్రీతిజింతా తాగిన స్ట్రా తోనే మహేష్ బాబును కూడా తాగమని రాఘవేంద్రరావు చెప్పారట. అయితే ఈ విషయం వినగానే మహేష్ బాబు ఏంటి ఆ హీరోయిన్ తాగిన ఎంగిలి నేను మళ్ళీ తాగాలా అంటూ అలిగి అక్కడి నుండి వెళ్లిపోయారట.

అయితే మహేష్ బాబు ఇలా అలిగి వెళ్లిపోవడానికి కారణం రాఘవేంద్రరావుతో ఆయనకి ఉన్న అనుబంధమే అని తెలుస్తోంది. రాఘవేంద్రరావుతో ఆయనకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉందట. కృష్ణతో రాఘవేంద్రరావు సినిమాలు తీసిన సమయంలో మహేష్ బాబు షూటింగ్ సెట్ కి వెళ్లేవారట.అలా డైరెక్టర్ ని మహేష్ బాబు ప్రేమగా మామా అని పిలుచుకునే వారట. అలా రాఘవేంద్రరావుతో ఉన్న చనువుతోనే మహేష్ బాబు అలా సరదాగా షూటింగ్ నుండి వెళ్లిపోయినట్టు అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: