
తమిళంలో ఇరంబుదరై (తెలుగులో అభిమన్యుడు), సర్దార్ వంటి హిట్ సినిమాలను తీసిన దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ కధను రీసెంట్ గానే నాగ చైతన్య కి వినిపించారట . నాగచైతన్య కూడా ఈ కథను ఓకే చేశారట. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వకపోయినా సరే ఈ సినిమా కోసం కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేశారట. దర్శకుడు పీఎస్ మిత్రం ఈ స్పై సినిమా స్క్రిప్ట్ కి మరింత మెరుగులు దిద్దే పనుల్లో బిజీ అయిపోయారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఈ పని పూర్తయిపోయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేస్తారట . నాగచైతన్య - పి ఎస్ మిత్రన్ కాంబినేషన్ సెట్ అయిపోయినట్లే అంటూ ట్రెండ్ అవుతుంది. మరోపక్క నాగ చైతన్య - విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో "వృషకర్మ" అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక కార్తీ "సర్ధార్ 2" పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు పిఎస్ మిత్రన్. ఈ ప్రస్తుత కమిట్మెంట్ పూర్తయిన తర్వాత ఈ కాంబినేషన్ అధికారికంగా సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది . బ్యాక్ టు బ్యాక్ నాగచైతన్య మంచి మంచి కథలను చూస్ చేసుకోవడం పట్ల అంత శోభిత ధూళిపాల అదృష్టం అంటున్నారు జనాలు . శోభిత ధూళిపాళ్ల అడుగుపెట్టిన వేళా విశేషం నాగచైతన్యకి లక్కే లక్ కలిసి వచ్చేసింది అని ఈ సినిమాతో మరో 100 కోట్ల హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు . ఆల్రెడీ తండేల్ సినిమాతో 100 కోట్ల హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వృష కర్మ తో కచ్చితంగా 100 కోట్లు ఈజీగా దాటేస్తాడు. ఇప్పుడు ఈ సినిమాకి కమిట్ అయితే మాత్రం హ్యాటృఇక్ 100 కోట్ల హిట్ నాగచైతన్య ఖాతాలో పడడం పక్క అంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???