టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ కు ఊపు తెచ్చిన సినిమా.. నేటి పాన్ ఇండియా ట్రెండ్ కు మూలమైన సినిమా `బాహుబలి`. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో, ఎన్ని రికార్డులను సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే `బాహుబలి ది బిగినింగ్` విడుదలై తాజాగా పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బాహుబలి రీయూనియన్ పార్టీ గురువారం ఎంతో సందడిగా సాగింది. చిత్ర బృందం మొత్తం బాహుబలి 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు కదిలి వచ్చింది.
నటీనటులు ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్ తో పాటు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ఆయ‌న స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి భార్య వ‌ల్లి, రాజమౌళి కుమారుడు కార్తికేయ, ర‌చయిత విజయేంద్రప్ర‌సాద్, కెమెరామెన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్, నిర్మాత‌లు శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని త‌దిత‌రులు రీయూనియన్ అయ్యారు. నాటి రోజుల‌ను గుర్తు చేసుకుంటూ స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డిపారు.
అయితే బాహుబలి రీయూనియన్ లో చాలా ముఖ్య‌మైన ఇద్ద‌రు వ్య‌క్తులు మిస్ అయ్యారు. అదే పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు హీరోయిన్లు అనుష్క శెట్టి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఈ ఇద్ద‌రు బ్యూటీలు ఎందుకు డుమ్మా కొట్టారు అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు.
షూటింగ్స్ లో బిజీ ఉండి రాలేక‌పోయారా? లేక మ‌రేదైనా కార‌ణం ఉందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, బాహుబ‌లి చిత్రం త్వ‌ర‌లో రీరిలీజ్ కాబోతుంది. అయితే రెండు పార్టుల‌ను ఒక‌టిగా చేసి `బాహుబలి ది ఎపిక్` పేరుతో థియేట‌ర్స్ లోకి తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: