ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ లా మారిపోతుంది . ఎవరైనా సరే ఏ హీరో అయినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని చూస్ చేసుకుని ఆ కాన్సెప్ట్ హిట్ కొడితే మాత్రం మిగతా స్టార్ హీరోలు అందరూ కూడా అలాంటి కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించే డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా రీసెంట్ కాలంలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా "హిట్ 3". నాని ఇలాంటి ఒక జోనర్ ని టచ్ చేస్తాడు అని అసలు ఎవరు ఊహించలేకపోయారు . థియేటర్లో నానిని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటిస్తుంది నాని నేనా..? ఇది నిజంగా నాని నేనా..? అనిఆశ్చర్యపోయేంత రేంజ్ లో వైల్డ్ పర్ఫామెన్స్ చూపించాడు నాని .

నాని ఎప్పుడూ కూడా సాఫ్ట్ హీరో గానే ట్యాగ్ చేయించుకునేవాడు . అయితే హిట్ త్రీ తర్వాత మాత్రం వైల్డ్ నాని అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . నాని నటనకు మంచి మార్కులు దక్కేలా చేసింది .అయితే ఇప్పుడు నానిని చూసి రామ్ చరణ్ కూడా అదే విధంగా వైల్డ్ గా మారే జోనర్ లో సినిమాలను చూస్ చేసుకుంటున్నారట . ఆల్రెడీ ఇప్పుడు పెద్ద సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ . ఈ సినిమా అయిపోగానే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్.. సందీప్ రెడ్డివంగా ..లోకేష్ కనగరాజ్..  డైరెక్టర్లతో కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాని వీళ్లల్లో ఒకరికి వైల్డ్ గా ఉండే స్టోరీని తెరకెక్కించే విధంగా మాట్లాడుతున్నారట. హిట్ సినిమాలో నాని ఎలా క్రూరంగా బిహేవ్ చేస్తాడో.. ఎంత వైల్డ్ పెర్ఫార్మన్స్ చూపించేలా స్టోరీ రాయండి అంటూ ఆ టైప్ ఆఫ్ జోనర్ లో ఒక కథ రాయండి అంటూ సజెస్ట్ చేస్తున్నారట.  చాలామంది అలాంటి కాన్సెప్ట్ అంటే సందీప్ రెడ్డివంగాకే మ్యాచ్ అవుతుంది అంటున్నారు . అయితే ఇక్కడ మెగా ఫాన్స్ మాత్రం ఫుల్ డల్ అయిపోతున్నారు. నానికి అలాంటి క్యారెక్టర్ సూట్ అవ్వచ్చు రామ్ చరణ్ లాంటివాళ్ళకి అలాంటి క్యారెక్టర్ సూట్ కాకపోవచ్చు .. నానిని చూసి ఇలాంటి డెసిషన్ తీసుకుంటే అది కచ్చితంగా రాంగ్ స్టెప్ నే అవుతుంది అంటున్నారు. మరికొందరు మాత్రం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే కాబోలు అంటూ ఘాటుఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ చరణ్ తీసుకున్న డెసిషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: