
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. అసలు ఈ సినిమా విషయంలో ముందు నుంచి రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి. ముందుగా రిలీజ్ అయిన టీజర్ విషయంలో విజువల్స్ చాలా నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో చిత్ర యూనిట్ కాస్త జాగ్రత్తలు తీసుకుంది. గత ఏడాది రిలీజ్ కావాల్సిన డిసెంబర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఆ తర్వాత సమ్మర్ కు వాయిదా వేశారు. సమ్మర్ కూడా వెళ్ళిపోయింది. దసరాకు అన్నారు. అయితే ఇక్కడే చిరంజీవి సినిమా సోదరుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుందా ? అన్న చర్చలు ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. వీరమల్లు సినిమా ఈనెల 24న రిలీజ్ అవుతుంది.
ఇక ఓజి సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నమని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు విశ్వంభర సినిమా కూడా అదే డేట్కు వేస్తే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పరిస్థితి ఏంటి అన్నది ? ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా మెగా బ్రదర్స్ సినిమాల విషయంలో నెలకొన్న ఈ గందరగోళానికి చిరంజీవి స్వయంగా చెక్ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే విశ్వంభర పలు మార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమా కంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఎక్కువ క్రేజీ ఉంది. సెప్టెంబర్ 25 డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ టైంలో విశ్వంభర కూడా అదే డేట్కు తీసుకు వస్తామన్న పుకార్లు బయటకు వస్తూ ఉండటంతో మెగా అభిమానులు కాస్త కలవరం చెందుతున్నారు. దీనిపై త్వరగా ఓ క్లారిటీ వస్తే మెగా అభిమానులు కాస్త రిలాక్స్ అవుతారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు