
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ రిలీజ్ అయిన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . ఈ సినిమా క్లైమాక్స్ చాలా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు అంటూ మేకర్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ నటించబోతున్నారట . చాలా స్పెషల్ గా ఈ పాత్రను డిజైన్ చేశారట బుచ్చిబాబు సన . తెరపై ఇద్దరు మెగా హీరోస్ ని చూస్తే మెగా ఫ్యాన్స్ కు పూనకాలే. అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ కోసం ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ను పెద్ది సినిమాలో యాడ్ చేశాడు బుచ్చిబాబు సన అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.
నిజానికి ఈ పాత్రలో ముందుగా సాయి ధరమ్ తేజ్ ని అనుకున్నారట . కానీ సాయి ధరమ్ తేజ్ కన్నా కూడా వరుణ్ తేజ్ ఈ పాత్రకు బాగా సూట్ అవుతాడు అని జనాలు బాగా ఎంకరేజ్ చేస్తారు అన్న కారణంగానే ఇలా బుచ్చిబాబు సనా ప్లాన్ ఛేంజ్ చేశారట. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మూమెంట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ సెలక్ట్ అయిన్నట్లు తెలుస్తుంది..!!