తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా ప్రారంభమవడం అంటేనే … కథ, నిర్మాత, దర్శకుడు, నటీనటులు - అందరూ ఫిక్స్ అవుతారు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా చూస్తే, సినిమా పూర్తయ్యేలోపల అనేక మార్పులు జరగడం సహజమైపోయింది. ముఖ్యంగా హీరోయిన్లు చివరి నిమిషంలో తప్పుకోవడం, నిర్మాతలకు తలనొప్పిగా మారింది. తాజాగా టాలీవుడ్‌లో చోటుచేసుకున్న కొన్ని పెద్ద హీరోయిన్ల ప్రాజెక్ట్ రీప్లేస్‌మెంట్ లిస్టు ఇది.


 శ్రుతి హాసన్ → మృణాల్ ఠాకూర్ (డకాయిట్) :
టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ చిత్రంలో తొలుత శ్రుతి హాసన్‌ను ఫీమేల్ లీడ్‌గా తీసుకున్నారు. ఆమె షూటింగ్‌లో పాల్గొంది. పోస్టర్లు కూడా వచ్చాయి. కానీ కొద్ది రోజులకే ఆమె తప్పుకుంది. మేకర్స్ ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 25న విడుదల కానుంది.

శ్రీలీల → మీనాక్షి చౌదరి (అనగనగ ఒక రాజు) :
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగ ఒక రాజు’ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరి భర్తీ చేసింది.

శ్రీలీల → భాగ్యశ్రీ భోర్సే (లెనిన్)  :
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమాలో శ్రీలీల ఫస్ట్ ఛాయిస్. టీజర్‌లో కూడా కనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుండి సైలెంట్‌గా తప్పుకుందని సమాచారం. మేకర్స్ భాగ్యశ్రీ భోర్సేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

 పూజా హెగ్డే → శ్రీలీల (ఉస్తాద్ భగత్ సింగ్) :
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ చివరికి శ్రీలీలనే ఫైనల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లోనూ అల్టిమేట్ రీప్లేస్‌మెంట్ జరిగింది.

 పూజా హెగ్డే → మమిత బైజు (ధనుష్ – విఘ్నేష్ రాజా) :
తమిళ హీరో ధనుష్ – డైరెక్టర్ విఘ్నేష్ రాజా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ తొలుత పూజా పేరు వినిపించింది. అయితే మేకర్స్ చివరకు మలయాళ నటి మమిత బైజు ను తీసుకున్నారు.

 దీపికా పదుకొణె → త్రిప్తి దిమ్రీ (స్పిరిట్ – ప్రభాస్) :
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాలో మొదట దీపికా పదుకొణె ను తీసుకోవాలనుకున్నారు. కానీ దీపిక డిమాండ్లు ఎక్కువ కావడంతో దర్శకుడు తన నిర్ణయం మార్చుకుని త్రిప్తి దిమ్రీను తీసుకున్నారు.

ఇలాంటివి సినిమాల్లో సాధారణంగా మార్పులు ఉంటాయి. కానీ స్టార్ హీరోయిన్లు ఒక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల షూటింగ్ షెడ్యూల్స్, ప్రచార కార్యక్రమాలు, కథలు కూడా మారిపోతున్నాయి. ఇక అభిమానులకు కన్ఫ్యూజన్‌ అయితే మామూలే !

మరింత సమాచారం తెలుసుకోండి: