ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు చిరంజీవి . "విశ్వంభర" సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి . కానీ కొన్ని కారణాలు చేత  ఈ సినిమా లేట్ అవుతుంది. వి ఎఫ్  ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా  లేట్ అవుతున్నందుకు కారణంగా సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం చేస్తున్నారు అంటూ మూవీ టీం ప్రకటించింది . అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు . కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి - మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ బాగా  వైరల్ గా మారింది .

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట . ఈ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి ఒక డ్రిల్ మాస్టర్ గా కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పేరు "శివ శంకర వరప్రసాద్".  హైలెట్ ఏంటంటే ఇదే పేరుని టైటిల్ గా కూడా ఫిక్స్ చేసేసాడట అనిల్ రావిపూడి . సినిమా మొత్తం కూడా శివశంకర వరప్రసాద్ అనే పేరు పైనే ఫన్నీ ఫన్నీగా సీన్స్ వచ్చేలా రాసుకున్నారట.  ఈ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి కామెడి  టైం వేరే లెవెల్ లో ఉంటుంది అంటున్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమాలో హీరోయిన్ గా సౌత్ ఇండియా క్రేజియస్ట్ బ్యూటి నయనతార నటిస్తుంది.  రెండో హీరోయిన్గా క్యాధరిన్ ధెరిస్సా నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీరౌతేలా ని చూస్ చేసుకున్నారట . ఇంకా దీని పై  అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాకి భీమ్‌స్ సంగీతం అందిస్తుండగా  షైన్స్ వారు నిర్మిస్తున్న . అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ ముందుగానే ప్రకటించేసాడు అనిల్ రావిపూడి . అనిల్ రావిపూడి ఏం చెప్పినా సరే పర్ఫెక్ట్ టైమింగ్ తో చేసేస్తాడు . చూడాలి మరి ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మెగా స్టార్ చిరంజీవి ఎటువంటి హిట్ అందుకోబోతున్నాడు అనేది.???


మరింత సమాచారం తెలుసుకోండి: