ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ లా మారిపోయింది అన్న సంగతి అందరికీ తెలుసు . పాత సినిమాలలో హిట్ అయిన పాటలను మరొకసారి తమ సినిమాలలో రీమేక్  చేసి పెట్టుకొని హైలెట్గా మారుతున్నారు హీరోలు.  మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి సైతం అదే పని చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద ఫేవరెట్ హిట్ సాంగ్ గా మిగిలిపోయిన అన్నయ్య మూవీలోని "ఆటకావాలా పాట కావాలా" సాంగ్ ను రీమేక్ చేయబోతున్నారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది .

ఈ సాంగ్ లో స్పెషల్ క్యారెక్టర్ లో అయితే ఊర్వశీ రౌతేలా కనిపించబోతుంది అంటూ కూడా టాక్ కూడా వినిపించింది. అయితే ఇప్పుడు అదే రూట్ లో వెళ్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ తెలుస్తుంది. ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ ..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే "డ్రాగన్" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే దేవర 2 ని సెత్స్పైకి తీసుకునిరాబోతున్నాడు.

 ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వం లో తెరకెక్కే "మురుగన్" సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఇలా బ్యాక్ టు బ్యాక్ మొత్తం 12 సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్న తారక్ తన కెరీర్ లో  ఓ సూపర్ డూపర్ హిట్ సాంగ్ రీమేక్ చేయబోతున్నారట. " నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి" అనే పాటను తారక్.. దేవర 2 కోసం రీమేక్ చేయబోతున్నారట.  దీనిపై అఫీషియల్ ప్రాకటన లేనప్పటికీ ఆల్మోస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో అంతా సెట్ చేసుకున్నట్లే అంటూ తెలుస్తుంది.ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ ని మరొకసారి అలాంటి పర్ఫామెన్స్ లో చూస్తే మాత్రం ఫ్యాన్స్  రచ్చ రంబోల చేసేస్తారు. అందులో నో డౌట్..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: