ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకుల లో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు సంగీతం అందించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈయన తన సంగీతంతో కూడా సినిమాను హిట్ వైపు తీసుకువెళ్లిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దానితో స్టార్ హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ఎక్కువ శాతం పని చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు లో ఈయన విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నాని హీరో గా రూపొందుతున్న  ది ప్యారడైజ్ అనే సినిమాకు కూడా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు ఈయన చాలా ఇతర భాష సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఈయన సంగీతానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తూ ఉండడంతో ఈయన తన పారితోషకాన్ని భారీ మొత్తంలో పెంచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈయన ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్ల వరకు పారితోషకం అందుకోగా ఇక ఇప్పటి నుండి తన పారితోషకాన్ని ఏకంగా 3 కోట్లు పెంచి ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు పారితోషకంగా అందుకోవాలి అని ఈయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన సంగీతం అందిస్తున్న మూవీలకు మ్యూజిక్ హక్కుల ద్వారా అనే పెద్ద మొత్తంలో డబ్బులు వెనక్కు వస్తాయి అని , అందుకే ఆయన ఈ స్థాయిలో పారితోషకం ఒక్కో మూవీ కి తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అంటే ఆ మూవీ పై మాత్రం అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: