
నిన్న సాయంత్రమే ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆ విషాద ఛాయలు మరువక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి బి . సరోజా దేవి (87) కన్నుమూశారు. పలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం బెంగుళూరులోని తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచిన్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సరోజాదేవి తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషలలో కలిపి మొత్తం 200 పైగా సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు.
మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో ఆమె మంచి సినిమాలలో నటించారు . 1938 జనవరి 7న జన్మించిన ఆమె "మహాకవి కాళిదాసు" అనే కన్నడ చిత్రం తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆమెకు జాతియ అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత కొన్ని సహాయ పాత్రలో కూడా నటించింది. మరి ముఖ్యంగా ఆమెకు మొట్టమొదట పెద్ద విజయాన్ని అందించింది మాత్రం "పాండురంగ మహత్యం:. 1957లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆమె కెరియర్ ని మలుపు తిప్పింది. ఎన్టీరామారావుతో స్క్రీన్ షేర్ చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. తెలుగు లో ఆమె నటించిన మొదటి సినిమా ఇదే. ఆ తర్వాత నటి కృష్ణకుమారికి కూడా డబ్బింగ్ చెప్పింది . అంతే కాదు పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
1998 మరియు 2005లో రెండుసార్లు, సరోజా దేవి ఫిల్మ్ జ్యూరీలకు అధ్యక్షత వహించారు. అంతేకాదు.. ఆమె కన్నడ చలనచిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగా మరియు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతోంది. ఆమె మరియు కొంతమంది ఇతర సినీ ప్రముఖులు 1972లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించిన కర్ణాటక ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. సరోజా దేవి తన భర్త మరియు తల్లి పేరుతో అనేక విరాళ శిబిరాలను నిర్వహించింది. ఆమె ఛారిటబుల్ ట్రస్టులు, పునరావాస కేంద్రాలు మరియు పలు ఆరోగ్య సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. ఆమె మృతి పట్ల పలువుతు ప్గాఢ సంతాపం తెలుపుతున్నారు.