తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన గుర్తిం పు కలిగిన నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు . ఈయన ఎన్నో సంవత్స రాలు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలి గిన నటుడిగా కెరియర్ను కొనసాగించాడు . ఇంత గొప్ప నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న ఆయన తాజాగా మరణించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గొప్ప సేవలు చేసిన ఆయన మరణించడంతో ఎంతో మంది సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇది ఇలా ఉంటే కోట శ్రీనివాసరావు నటుడిగా మాత్రమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు మరికొన్ని రకాలుగా కూడా ఎంతో మంచి చేశాడు. ఆయన జీవితంలో ఒక విశిష్ట ఘట్టం ఉంది అది ఏమిటి అనేది తెలుసుకుందాం.

కోటా శ్రీనివాసరావు జీవితంలో ఎంతో విశిష్టమైన ఘట్టం 1994 వ సంవత్సరం అక్టోబర్ నెలలో చోటుచేసుకుంది. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య మరియు ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర సమాఖ్య మధ్య మొదట చిన్న సమస్య ఏర్పడింది. ఆ వివాదం పెరిగి పెరిగి మొత్తం చిత్ర పరిశ్రమ స్తంభించిన నేపథ్యంలో కోట శ్రీనివాసరావు కార్మికుల సంక్షేమం , సమైక్యత కోసం ఏకంగా నిరాహార దీక్షను చేపట్టారు. ఇక కోట శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేయడంతో ఆయన దీక్షా శిబిరం వద్దకు ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. అలాగే ఎంతో మంది హీరోలు నిమ్మరసం తాగించి కోటా శ్రీనివాసరావు ను నిరాహార దీక్ష విరమించేలా చేశారు. ఇలా కోటా శ్రీనివాసరావు చేసిన నిరాహార దీక్ష ఆయన జీవితంలో విశిష్ట ఘట్టం గా చాలా మంది పరిగణిస్తూ ఉంటారు. అలాగే కోటా శ్రీనివాసరావు ఆ సమయంలో చేసిన నిరాహార దీక్ష కి సినీ పరిశ్రమ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: