
1990లలో హిట్స్ పరంపర కొనసాగిస్తూ, చేతినిండా సినిమాలతో బిజీగా గడిపింది. కానీ ఈ పండుగ కాలం ఎక్కువ కాలం నిలబడలేదు .26 ఏళ్లకే సినీ పరిశ్రమకు గుడ్‌బై .. ‘విరలుకట్ట ఉదమియా’ (2002) చిత్రం తర్వాత కనక స్క్రీన్ మీద కనిపించలేదు. అప్పటికే ఆమె వయసు కేవలం 26. ఇక ఎందుకు సినిమాలకు దూరమైందన్న ప్రశ్నకు మాత్రం ఎప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదు. అభిమానులు ఆశ్చర్యపోయేలా ఆమె పూర్తిగా సినీ ప్రపంచం నుంచి తప్పుకున్నది. వ్యక్తిగత జీవితం – ఒంటరితనానికి నాంది ... కనక తల్లి దేవికా, 2002లో ఆకస్మాత్తుగా 59 ఏళ్ల వయసులో మరణించారు. అప్పటి నుంచి కనక ఒంటరిగా జీవితం కొనసాగించింది. 2007లో ఆమె అమెరికా, కాలిఫోర్నియాకు చెందిన ఓ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుందనే వార్తలు వచ్చాయి. కానీ 2010లో ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ప్రకటన షాక్‌కు గురిచేసింది –
“పెళ్లైన 15 రోజులకు ఆయన కనిపించకుండా పోయాడు” అని చెప్పింది కనక. ఆ తర్వాత అతని గురించి ఏ సమాచారం లేదు. రూమర్లు, వైరల్ ఫోటోలు .. ఆమె చనిపోయిందంటూ ఓ దశలో పుకార్లు వచ్చినప్పుడు, తాను బాగానే ఉన్నానంటూ కనక ఓ వీడియోలో వెల్లడించింది. ఆ తర్వాత ఆమె పూర్తిగా బయట ప్రపంచానికి దూరంగా జీవిస్తోంది. ఇటీవల నటి కుట్టి పద్మినితో కలిసి కనక దిగిన ఓ ఫోటో నెట్టింట్లో వైరలవ్వగా, అందులో ఆమెను గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపం అభిమానులను కలవరపెట్టింది. ఒక నాటి వెలుగు.. ఇప్పుడు మౌనంగా! .. కనక జీవిత కథ అనుకోని మలుపులతో, సడెన్లతో నిండి ఉంది. సినీ ప్రపంచంలో వెలుగులు చూసిన ఆమె, ప్రస్తుతం పూర్తిగా మౌనంగా, ఒంటరిగా జీవితం గడుపుతోందన్న విషయం బాధ కలిగించకమానదు. ఆమె ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా, శాంతిగా ఉండాలని అభిమానుల ఆకాంక్ష. "ఒకప్పుడు వెండితెరపై వెలిగిన తార.. ఇప్పుడు మేఘాల వెనుకకి మాయమైంది!"
