ధియేటర్లలో విడుదలైన సినిమాలు నెలరోజుల గ్యాప్ తో ఓటీటీ లో ప్రత్యక్షమవుతున్నాయి. దీనితో సినిమాలు చూడటానికి సగటు ప్రేక్షకులు ఆశక్తి చూపడంలేదు. టాప్ హీరోల సినిమాల నుండి చిన్నహీరోల సినిమాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాతలు ఎగ్జిబిటర్లు గోలపెడుతున్నా ఎవరు పెద్దగా పట్టించుకోవడంలేదు.

ఈవారం విడుదల అవుతున్న ఒక చిన్న సినిమా పరిస్థితి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేపు రిలీజవుతున్న కొత్త సినిమాల్లో తమిళ మూవీ ‘డి ఎన్ ఏ’ కూడ ఉంది. తెలుగులో ఈమూవీని ‘మై బేబీ’ అన్న టైటిల్ తో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈసినిమా తమిళ ఒరిజినల్ వెర్షన్ జూన్ 20న  విడుదలై మంచి స్పందనే దక్కించుకుంది. దీనితో ఈసినిమాను తెలుగులో కూడ డబ్ చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించాడు.

అయితే ఈ తెలుగు డబ్బింగ్ సినిమా రేపు విడుదల అయిన వెంటనే మరునాడు. ఓటీటీ లోకి రావడంతో ఈసినిమాను టిక్కెట్ పెట్టికొనుక్కుని ధియేటర్ కు వచ్చి ఎవరు చూస్తారు అన్న సందేహాలు చాలమందికి కలుగుతున్నాయి. ఓటీటీ సంస్థతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈసినిమా విడుదలైన 30 రోజులకు స్ట్రీమ్ అవుతున్నప్పటికీ ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడ ఓటీటీ లో అందుబాటులోకి వస్తూ ఉండటంతో ఈ తెలుగు డబ్బింగ్ సినిమా రైట్స్ ను కొనుకున్న బయ్యర్లు గగ్గోలు పడుతున్నారు.

ప్రస్తుతం ప్రేక్షకులు తెలివి మీరిపోయి ప్రతి వారం కొత్త ఓటిటి కంటెంట్ ఏమొస్తుందో ముందే చూసుకుంటు సినిమాలకు రావడం మానేస్తున్నారు. దీనితో ఒక మీడియం రేంజ్ సినిమాకు రెండవ వారం పోస్టర్ కూడ పడని ఒక విచిత్ర పరిస్థితులలో కొన్ని చోట్ల సినిమా విడుదలైన మొదటి రోజే షోలు క్యాన్సిల్ అవుతున్న సందర్భాలు రావడంతో భవిష్యత్ లో సినిమాలు తీయడానికి అదేవిధంగా కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: