పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నీది అగర్వాల్ ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటించగా ... జ్యోతి కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగాన్ని జులై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

సినిమా పవన్ కెరిర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ , వేదికను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను జూలై 21 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. 

ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఎవరు వస్తారు అనే విషయంపై మూవీ యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. మరి ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరైనా ముఖ్య అతిధులు వస్తారా ..? లేక మూవీ యూనిట్ తోనే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ముగిస్తారా అనేది చూడాలి. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... ఏ ఏం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: