కోలీవుడ్ నటుడు విశాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడే. ఈయన సినిమాలతో తెలుగులో కూడా ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి నటుడు విశాల్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఆయనకి 47 ఏళ్లు పూర్తవుతున్నా కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు. ఇక ప్రతిసారి పెళ్లి గురించి వార్తలు వినిపించినప్పుడల్లా కోలీవుడ్ లో నటీనటుల నడిఘర్ సంఘం భవనం పూర్తయినప్పుడే నేను పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఉంటారు.ఇక ఆ మధ్యకాలంలో ఓసారి పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే రీసెంట్ గా విశాల్ ఒక గుడ్ న్యూస్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఓ హీరోయిన్ తో తన పెళ్లి జరగబోతుందని అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని    సినిమా ఈవెంట్లో కన్ఫామ్ చేశారు..'

 వీరిద్దరూ కలిసి ఆ ఈవెంట్లో పాల్గొనడమే కాకుండా తమ పెళ్ళి, ప్రేమకు సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఆగస్టు లో నడిగర్ సంఘ భవనం ఓపెనింగ్ చేసి నా బర్త్ డే రోజు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతాను అంటూ విశాల్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.అయితే విశాల్ బర్త్డే ఆగస్టు 29 న కాబట్టి ఈయన పెళ్లి కూడా అదే రోజు జరగబోతుందని,ఆయన బర్త్డే పెళ్లిరోజు ఒకే డేట్ అయితే బాగుంటుంది అని, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనే ఉద్దేశంతోనే విశాల్ తన బర్త్డే డేట్ ని తన పెళ్లి డేట్ గా మార్చుకోబోతున్నారని పలు వార్తలు వినిపించాయి. కానీ విశాల్ బర్త్డే రోజు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతారని చెప్పారు.

కానీ అదే రోజు పెళ్లి మాత్రం అని చెప్పలేదు.అయితే తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం విశాల్ పెళ్లి వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.. అయితే విశాల్ పెళ్లి వాయిదా పడడానికి కారణం నడిగర్ సంఘ భవనం మరింత ఆలస్యం కావడమే నట. అయితే నడిగర్ సంఘ భవనం ఆగస్టు వరకు పూర్తవుతుంది అని విశాల్ అనుకున్నారు. కానీ ఆ భవనం పూర్తి కావడంలో మరింత ఆలస్యం అవుతుందట. అందుకే నడిగర్ సంఘ భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ముందు ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. అలా విశాల్ సాయి ధన్సికల పెళ్లి వాయిదా పడ్డట్టు సమాచారం. మరి నిజంగానే విశాల్, సాయిధన్సిక ల పెళ్లి వాయిదా పడిందా.. లేక కోలీవుడ్ లో వినిపించే రూమరా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: