
అలాగే బిగ్ బాస్ సీజన్ 2లోనూ పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్న నందిని, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న కట్టినమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె చెప్పిన ప్రకారం, తాను నటించిన "దళపతి విజయ్" హీరోగా వచ్చిన "వారసుడు" సినిమాలో తన పాత్రను చాలా వరకు 'ఎడిటింగ్‌లో కట్ ' చేశారని తెలిపారు. ఈ సినిమాలో నందిని శ్రీకాంత్‌తో ఎఫైర్ పెట్టుకొని ఫ్యామిలీని విభజించే ఓ కీలక నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపించాల్సి ఉండేది. అయితే సినిమాకు ముందు ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పడంతో పాటు, ప్రత్యేక పోస్టర్ కూడా విడుదల చేశారు. దాంతో తన పాత్రపై ఆశలు పెట్టుకున్నానని నందిని అన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఏం జరిగిందంటే.. ఆమె పాత్రను మొత్తానికి 'రెండు నిమిషాలకే పరిమితం' చేసేశారు.
“సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌లో చూసి షాక్ అయ్యాను. నా మొత్తం పాత్రను కట్ చేసి, కేవలం చిన్న క్లిప్ మాత్రమే వదిలారు. నన్ను చాలా బాధపెట్టింది. నా మీద నెగటివ్ ఇంపాక్ట్ పడింది,” అంటూ ఎమోషనల్ అయ్యారు నందిని రాయ్. ఇంకా ఆమె మాట్లాడుతూ, “ఇలాంటి అనుభవం కలిగిన తర్వాత మళ్లీ ఇలాంటి సినిమాల్లో నటించను. ముందే చెప్పినట్లు, ఆ పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదంటే మానవతా దృష్టితో కూడా ఆర్టిస్ట్‌ను కాపాడాలి కదా..!” అంటూ విచారం వ్యక్తం చేశారు. నందినిలాంటి టాలెంటెడ్ నటి ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనడం ఇండస్ట్రీలో జరుగుతున్న అసంతృప్తికర వాస్తవాలను బయటపెడుతుంది. పాత్ర ఎంత చిన్నదైనా దానికి న్యాయం చేయకపోతే, ఆ నటీ మణులకు అది తీవ్ర నిరాశ కలిగించే అంశం అవుతుంది. ఇప్పుడైనా దర్శకులు, నిర్మాతలు ఈ విషయాన్ని గమనించి, నటీనటుల శ్రమకు గౌరవం ఇవ్వాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.