నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ హిట్స్‌లో `బింబిసార‌` ఒక‌టి. 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు కథ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ను యంగ్ అండ్ టాలెంటెడ్ వశిష్ఠ డైరెక్ట్ చేశాడు. 2022లో రిలీజ్ అయిన బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా `బింబిసార 2`ను కూడా మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.


కాక‌పోతే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను వశిష్ఠ కాకుండా కొత్త ద‌ర్శ‌కుడు అనీల్ పదురీ తీసుకున్నారు. క‌ళ్యాణ్ రామ్‌తో గొడ‌వలు కార‌ణంగా వ‌శిష్ఠ బింబిసార 2 నుంచి త‌ప్పుకున్నార‌ని గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఈ విష‌యంపై వ‌శిష్ఠ ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వ‌శిష్ఠ మాట్లాడుతూ.. బింబిసార 2 కి అనీల్ పదురీ మంచి క‌థ రాశాడు. నాక‌న్నా బెటర్ గా మంచి ఐడియా క్రాక్ చేసాడు. దాంతో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే సెట్ అవ్వ‌ద‌నిపించింది.


అనీల్ నా కంటే బెట‌ర్‌గా తీస్తాడనే న‌మ్మ‌కం నాతో పాటు క‌ళ్యాణ్ రామ్ కు కూడా వ‌చ్చింది. అత‌డే బెట‌ర్ అని ఇద్ద‌రం క‌లిసి ఫిక్స్ అయ్యాకే బింబిసార 2 నుంచి నేను త‌ప్పుకున్నా` అంటూ చెప్పుకొచ్చాడు. అంతే త‌ప్ప త‌న‌కు, క‌ళ్యాణ్ రామ్ కు ఎటువంటి గొడ‌వ‌లు లేవ‌ని వ‌శిష్ఠ స్ప‌ష్టం చేశాడు. త్వ‌ర‌లోనే బింబిసార 2 సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంద‌ని కూడా తెలిపారు. కాగా, వ‌శిష్ట ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో `విశ్వంభ‌ర‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో లేదా వ‌చ్చే ఏడాది ఆరంభంలో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: