త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైలాగ్స్ బాగా రాయడం కాదు ..కథలు బాగా రాయడం కాదు.. హీరోయిన్ లని  కూడా పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుంటూ ఉంటారు.  ఏ హీరోకి ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది .. ఏ క్యారెక్టర్ కి ఏ బ్యూటీ అయితే బాగుంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు . ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత హైలెట్ అయ్యాయో అందరికీ తెలిసిందే . కచ్చితంగా  ఆయన తెరకెక్కించే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు మొదటి హీరోయిన్ కి ఎంత వాల్యూ ఉంటుందో రెండవ హీరోయిన్ కి కూడా అంతే వాల్యూ ఉంటుంది.


ఇద్దరి హీరోయిన్స్ ని హైలైట్ అయ్యే విధంగా కధలు రాసుకుంటూ ఉంటారు . కాగా మరికొద్ది రోజుల్లోనే వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్ . రెండు వారాల్లో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ సమాచారం అందుతుంది . ఈ సినిమా లో ఇద్దరిని హీరోయిన్లుగా చూస్ చేసుకున్నారట త్రివిక్రమ్. ఇద్దరు కూడా ట్రెడిషనల్ బ్యూటీ లే. వాళ్లల్లో ఒకరి స్నేహాను అదే విధంగా మరొక పాత్ర కోసం సంయుక్త మీనన్ ని చూస్ చేసుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాసరావు .



ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. "సంక్రాంతి" సినిమా హిట్ అవ్వడానికి కారణం స్నేహ - వెంకటేష్ ల పర్ఫామెన్స్ . మళ్లీ ఇన్నాళ్ళకి వీళ్ళు జతకట్టబోతున్నారు.  ఇక సంయుక్త మీనన్ ఎంత ట్రెడిషనల్ గా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఆమె చెప్పే డైలాగ్స్ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి.  వెంకటేష్ లాంటి స్టార్ ఫామిలీ హీరో కోసం ఇద్దరు ట్రెడిషనల్ బ్యూటీస్ ని చూస్ చేసుకోవడం త్రివిక్రమ్ నిజంగా గ్రేట్ అంటున్నారు.  అంతేకాదు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాలోని  సీన్స్ డైరెక్ట్ చేయబోతున్నారట త్రివిక్రమ్.  ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఆల్ రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇరగదీశాడు వెంకటేష్. అలాంటి పర్ ఫామెన్స్ మరోసారి ఈ సినిమాలో చూడబోతున్నాం అని చెప్పుకోవడం లో సందేహమే లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: