గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ ఆ డబ్బును ఒకేసారి చూసి ఎక్కడ దాచుకోవాలో తెలియక రాత్రంతా నిద్ర కూడా పోలేదట. నెల రోజులపాటు డబ్బుతోనే సావాసం చేశారట.ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ డబ్బును బ్యాగ్ లో పట్టుకొని తీసుకొని వెళ్లి పోయేవారట. ఇంట్లో బీరువాలో పెట్టి మళ్ళీ దాన్ని చూసి లెక్కలు పెట్టి మళ్ళీ మరోచోట పెట్టి ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో తన కారు డాష్ బోర్డులో పెట్టుకొని ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ డబ్బులను పట్టుకుని వెళ్లిపోయే వారట. కానీ నెల రోజులకి ఓ పని చేశారట. ఏంటి ఈ గోల..ఆ డబ్బు ఆ డబ్బు అంటున్నారు కానీ ఏ డబ్బు అనేది మాత్రం చెప్పడం లేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు.

 ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. అయితే ఈ సినిమా కి వచ్చిన మొదటి రెమ్యూనరేషన్ 4 లక్షలు.. అప్పట్లో ఆ డబ్బులు అన్ని చెక్కు రూపంలో కాకుండా క్యాష్ రూపంలోనే నిర్మాత చెల్లించారట.అయితే ఒకేసారి అన్ని డబ్బులు చూసి ఎన్టీఆర్ కి మతి పోయిందట. అసలు ఈ డబ్బులన్నీ ఏం చేయాలి.. ఎవరికి ఇవ్వాలి అనే తెలియక నెల రోజుల పాటు ఆ డబ్బుల్ని పట్టుకొని కూర్చున్నారట. అంతేకాదు తల్లికి కూడా ఇవ్వలేదట.

 ఒకవేళ ఇంట్లో పెడితే ఎవరు దొంగతనం చేస్తారోనని భయపడి ఎక్కడికి వెళ్తే అక్కడికి తన కారులో తీసుకెళ్లి పోయావారట. కారులో పెడితే ఎవరైనా దొంగతనం చేస్తారని దాన్ని బ్యాగులో వేసుకొని తిరిగేవారట. నెల రోజుల పాటు ఆ డబ్బుల్ని పట్టుకొని తిరిగి చిరాకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చివరికి తల్లి చేతిలో ఆ డబ్బులు పెట్టి అమ్మ నీకు ఇష్టమైనది కొనుక్కో.నగలు కొనుక్కుంటావో చీరలు కొనుక్కుంటావో నీ ఇష్టం. ఏమైనా చేసుకో అని ఇచ్చారట.ఇక తల్లి చేతిలో డబ్బులు పెట్టాకే ఆయనకు నిద్ర పట్టిందట.

ఆ నాలుగు లక్షలు తన చేతిలో ఉన్నంతసేపు ఎన్టీఆర్ అసలు నిద్ర కూడా సరిగ్గా పోలేదట.అలా ఒకేసారి అన్ని డబ్బులు చూసేసరికి ఎన్టీఆర్ కి చాలా విచిత్ర పరిస్థితి ఎదురైంది అంటూ ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఒక ఏజ్ వచ్చే వరకు జూనియర్ ఎన్టీఆర్ తనకు వచ్చిన డబ్బులన్నీ తల్లికి అప్పచెప్పేవారట. తనకు డబ్బులు ఎలా మేనేజ్ చేయాలో తెలిసే దాకా తన దగ్గరే పెట్టుకున్నారట.అలా నాలుగు లక్షల తీసుకునే స్టేజి నుండి ప్రస్తుతం 50, 60కోట్లు తీసుకునే రేంజ్ కి ఎదిగారు ఈ నందమూరి తారక రాముడు

మరింత సమాచారం తెలుసుకోండి: