
తాజాగా హరిహర వీరమల్లు సినిమాకి ఒక పెద్ద కష్టం వచ్చి పడినట్లు తేలుస్తోంది. నిర్మాత ఎ.ఎం రత్నం బంగారం, ముద్దుల కొడుకు, ఆక్సిజన్ వంటి చిత్రాలు వల్ల నష్టపోయారని వాటిని భర్తీ చేయాలంటూ ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసిన లేఖ రావడం సంచలనంగా మారింది. ఈ లేఖలో ఆక్సిజన్ సినిమా పై రూ.2.60 కోట్ల బకాయిలు ఉన్నాయని వీటన్నిటిని రికవరీ చేయాలంటూ శ్రీ సూర్య మూవీస్ పైన ఫిర్యాదు చేశారు డిస్ట్రిబ్యూటర్స్. అలాగే బంగారం, ముద్దుల కొడుకు వంటి చిత్రాలకు గాను రూ.90 లక్షల రూపాయలు బ్యాలెన్స్ రిఫండబుల్ ఇవ్వాలి అంటు ఎ.ఏం రత్నం పైన మహాలక్ష్మి ఫిలిమ్స్ వారు మరొక ఫిర్యాదు చేయడం జరిగింది.
దీన్నిబట్టి చూస్తూ ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నారని ఇందుకు సంబంధించి పరిష్కారం చేసే విషయంపై ఛాంబర్ లో కూడా ప్రతి ఒక్కరు సహకరించాలంటూ కోరారట. అలాగే నైజాంలో హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందే ఈ డబ్బులను తిరిగి ఇచ్చేలా సహాయం చేయాలంటూ తాము అభ్యర్థిస్తున్నామంటూ తెలియజేశారు. మరి నాలుగు రోజులలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి..మరి ఎ.ఏం రత్నం పైన వచ్చిన ఈ ఫిర్యాదు పై ఎలా స్పందిస్తారో చూడాలి మరి. నైజాంలో హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుందా లేదా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.