మరికొన్ని రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా దర్శకులలో ఒకరైన జ్యోతి కృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫైట్స్ రొటీన్ కు భిన్నంగా ఉంటాయని వాటిలో మార్షల్ ఆర్ట్స్ స్కిల్ కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో అలాంటి ఫైట్లు ఆరు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. ఈ ఫైట్లు వేటికవి ప్రత్యేకం అని ఒక ఫైట్ ఎపిసోడ్ ను పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క ఫైట్ సీన్ ను 50 నుంచి 60 రోజుల పాటు షూట్ చేశామని డూప్ లేకుండా ఆ ఫైట్ సీన్ పూర్తయిందని ఆ సీన్ చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని ఆయన అన్నారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఈ సినిమాలోని పంచమి పాత్ర కోసం గుర్రపు స్వారి కథక్ భరతనాట్యం నేర్చుకున్నానని ఈ సినిమాలో నా పాత్ర మేకప్ కోసం ఐదు గంటల సమయం పట్టేదని ఐదు సంవత్సరాల ఈ సినిమా ప్రయాణం నాలో కొంత మార్పు రావడానికి కారణమైందని ఈ సినిమాకి సంబంధించి తొలిసారి కొల్లగొట్టినాదిరో సాంగ్ షూటింగ్లో పాల్గొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో గతంలో సత్యాగ్రహి అనే సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశానని ఆ సినిమాకు దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఏ ఆర్ రెహమాన్ ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అని టైటిల్ ప్రకటించిన తర్వాత పూజ కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించామని చెప్పుకొచ్చారు. కానీ సినిమా ఆ తర్వాత ఆగిపోయిందని నిర్మాత తెలిపారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ మీరు సత్యాగ్రహి చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది సార్ అని అన్నానని ఆ మాటకు పవన్ నవ్వి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే నేను కూడా అమీర్ ఖాన్ లా సినిమాలు చేస్తూ ఉండేవాడినని రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని పవన్ అన్నారని నిర్మాత చెప్పుకొచ్చారు.