
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం ఘనంగా జరగబోతుంది . కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కొద్ది గంటల ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరిని సర్ప్రైజ్ చేసింది హరిహర వీరమల్లు సినిమా టీం. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాం..? ఏ కారణంగా పెట్టాం..?? అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చారు. హరి హర వీర మల్లు సినిమా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." మీ అందరికీ తెలుసు ఇవాళ సాయంత్రం హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టాము. నిజానికి నాకు ఈ ప్రెస్ మీట్ ఇష్టం లేదు. కానీ నిర్మాత ఏఎం రత్నం గారి కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం".
"ఆయన చెప్పడం కారణంగానే ఇలా ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీడియా మిత్రులతో పెద్దగా క్లోజ్ గా మాట్లాడాలేము. అది అందరికి తెలిసిందే. ఆ కారణంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు". సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ట్రెండ్ అవుతున్నాయి . ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం తన సినిమా ఈవెంట్ లో పాల్గొని ఈ విధంగా మీడియా రిపోర్టర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు . అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తరువార పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ సినిమా హరిహర వీరమల్లు ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!!