పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సినిమా "హరిహర వీరమల్లు". క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమా జూలై 24వ తేదీ గ్రాండ్ గా విడుదల కాబోతుంది . ఈ సందర్భంగా టీం స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించింది . ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు . "పోడియం లేకుండా మాట్లాడడం చాలా కష్టంగా ఉంది అంటూ నవ్వుతూ పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ని స్టార్ట్ చేశారు". ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.."ఫస్ట్ టైం సినిమాలు పరంగా ప్రెస్ మీట్ పెడుతున్నాను . పొలిటికల్ పరంగా ఎన్నో పెట్టాను కానీ సినిమాలకి పెట్టలేదు. దీని కోసం ఎంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను అని చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటివరకు సినిమాలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టలేదు . నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నా ఫోటోలు కూడా పేపర్ లో ఎవరు వేయలేదు . దీంతో నాకు పబ్లిసిటీ లేకుండానే సినిమాలు రిలీజ్ చేసుకోవడం అలవాటైపోయింది. సినిమా గురించి నాకు ఏం మాట్లాడాలో పెద్దగా తెలియలేదు . సినిమాను తెరలకెక్కించాలి అంటే ఎన్నో యుద్ధాలు చేయాలి . ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రత్నం గారు . ఈ సినిమా కోసం చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేశారు . ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.  బాగా నలిగిపోయారు . నేను పాలిటిక్స్ లోకి వెళ్లిపోయిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేకపోయాను అయినప్పటికీ నా బెస్ట్ నేను ఈ సినిమాలో ఇచ్చాను . గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది" అంటూ చెప్పుకొచ్చారు.


అంతేకాదు పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ని కంటిన్యూ చేస్తూ.." ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ . ఆయువు పట్టు లాంటిది. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది . క్రిష్ కాన్సెప్ట్ ఈ సినిమాకి హైలైట్ గా మారుతుంది.  మా టీం అందరి తరపున క్రిష్ కి చాలా చాలా ధ్యాంక్స్. ఒక్కోసారి ఇండస్ట్రీ చాలా కఠినంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది . ఈ సినిమా పూర్తి అవుతుందా..? లేదా..? అన్న సందేహాలు వచ్చినప్పుడు మాకు కీరవాణి గారు ప్రాణం పోశారు . ఒక్కోసారి డబ్బులు సక్సెస్ కోసం కాదు ..ఇండస్ట్రీ కోసం ..ఇండస్ట్రీ బాగు కోరే వ్యక్తులు మన వెంట నిలబడడం ఎంతో ఎంతో ముఖ్యం . అందుకే నా ప్రత్యర్ధులు తిడుతున్న కూడా ఈ మీటింగ్ కి వచ్చా.  ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏ ఏం రత్నం ను ప్రతిపాదించాను.  సినిమా నాకు అన్నం పెట్టింది . అది ఎప్పటికీ మర్చిపోలేను.  సినిమా అంటే నాకు ప్రాణవాయువుతో సమానం అంటూ చెప్పుకొచ్చారు".


"మిగతా హీరోలకు బిజినెస్ అయినంతగా నా సినిమాలకు అవ్వదు . అది ఎందుకో అందరికీ తెలుసు . నేను ప్రజల కోసం దృష్టి పెట్టాను.  ఈ సినిమా ప్రమోషన్స్ ని మొత్తం తన భుజాలపై వేసుకున్నింది నిధి అగర్వాల్ . ఈ సినిమా అనాధ కాదు ఈ సినిమాకి నేనున్నాను అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను.  దేశ సమస్యల కోసం పోరాడే వాడిని.  నా సినిమా కోసం నేను ప్రమోషన్స్ చేసుకోలేనా ..? మన ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఎంతో ఆదరిస్తుంది . అందుకే ఈ సినిమా ప్రచారంలో భాగం కావాలని వచ్చాను . భారతీయ సినిమాలకు కుల - మత - బేధాలు ఉండవు . క్రియేటివిటీ మీదనే అంత ఆధారపడి ఉంటుంది . చిరంజీవి కొడుకు అయినా తమ్ముడైన ఎవ్వరైనా సరే టాలెంట్ లేకపోతే నిలబడలేరు . రేపు నా కొడుకు అయినా అంతే ఇక్కడ ప్రతిభ ముఖ్యం "అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు .



దీంతో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ సినీ ఎంట్రీ పై ఆల్మోస్ట్ ఆల్ అంతా క్లారిటీ తెచ్చుకున్నారు . పవన్ కళ్యాణ్ కొడుకు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపించాయి.  అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ లో తన కుమారుడి సినీ ఎంట్రీ ఉండబోతుంది అంటూ క్లారిటీకి వచ్చేసింది.  అయితే దర్శకుడు ఎవరు అనేది బిగ్ హాట్ టాపిక్ . చాలామంది క్రిష్ దర్శకత్వంలోనే అఖీరానందన్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: