రష్మిక మందన్నా..ఈ కన్నడ బ్యూటీ నిన్న మొన్నటి వరకు ఒక హీరోయిన్ మాత్రమే..కానీ ఇప్పుడు ఒక బ్రాండెడ్, ప్రాడక్ట్ ను లాంచ్ చేసిన ఫౌండర్. సాధారణంగా ఏ స్టార్ సెలెబ్రెటీ అయిన సరే సినిమాలో సక్సెస్ అయితే అందులో వచ్చిన డబ్బులు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు . చాలామంది హీరోలు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాక ఆ డబ్బులుతో పలు మాల్స్ , అదేవిధంగా బిజినెస్ లు స్టార్ట్ చేశారు . హీరోయిన్స్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రష్మిక మందన్నా కూడా అదే లిస్టులోకి వచ్చేసింది .


రీసెంట్ గానే అమ్మకు కాల్ చేస్తూ దేవుడు ఆశీర్వాదం అంటూ ఓ వీడియోని షేర్ చేస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది . అయితే తాజాగా ఆ బిజినెస్ ఏంటి..?? అనే విషయం బయట పెట్టింది. ఆమె పెర్ఫ్యూమ్ వ్యాపారం లోకి అడుగు పెట్టింది.  దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేసింది రష్మిక మందన్నా.  డియర్ డైరీ అనే పేరుతో ఎక్స్క్లూజివ్ పెర్ఫ్యూమ్ లైనప్ ని స్టార్ట్ చేసింది హీరోయిన్ రష్మిక మందన్నా.  ఇది కేవలం బ్రాండెడ్ మాత్రమే కాదు అని తనలో ఒక భాగం అని చాలా ఎమోషనల్ గా వీడియో షేర్ చేసింది .


"సెంట్ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది .  ఆ పరిమళాన్ని ఈరోజు మీతో కూడా పంచుకుంటున్నాను.  ఇది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఉత్సాహం కలిగిస్తుంది . అదే టైంలో కొంచెం భయంగా కూడా ఉంది . దీనిని ముందుకు తీసుకెళ్లడానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. సినిమాలో నన్ను ఎలాగైతే ఆదరించారో ఈ బిజినెస్ లో కూడా అలాగే ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను" అంటూ ఒక వీడియో షేర్ చేసింది . ఇది బాగా వైరల్ అవుతుంది. చాలామంది ప్రముఖులు సెలబ్రెటీల నుంచి ఆమెకు పూర్తి మద్దతు లభిస్తుంది.


సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పెర్ఫ్యూమ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతానికి ఆన్లైన్ అమ్మకాలకు పరిమితమైన ఈ బిజినెస్ త్వరలోనే అవుట్ లెట్స్ కూడా ఏర్పాటు చేస్తుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ప్రస్తుతం ఆన్లైన్ లో నాలుగు ఫ్లేవర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏటువంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా చేయబడినవి. ఈ పర్ ఫ్యూమ్‌స్ గులాబీ కమలం, జాస్మిన్,  లిచీ మరియు పాషన్ ఫ్రూట్ వంటి ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం బ్రాండ్ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు 10ంల్ బాటిల్ ₹599 నుండి 100ంల్ వేరియంట్ ₹2,599 వరకు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: