
అయితే ఏపీ మరియు తెలంగాణలో వీరమల్లు మూవీ రూ. 103.50 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 126 కోట్లు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ఇది. కానీ టాలీవుడ్ ఆల్ టైం టాప్ బిజినెస్ మూవీస్ రేసులో మాత్రం వీరమల్లు వెనకబడింది.
ఈ జాబితాలో రూ. 617 కోట్ల బిజినెస్ తో `పుష్ప 2 ది రూల్` టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్(రూ. 451 కోట్లు), కల్కి 2898 ఏడీ(రూ. 370 కోట్లు) బాహుబలి 2(రూ. 352 కోట్లు), సలార్ (రూ. 345 కోట్లు), సాహో(రూ. 270 కోట్లు), ఆదిపురుష్(రూ. 240 కోట్లు), గేమ్ ఛేంజర్(రూ. 221 కోట్లు), రాధే శ్యామ్(రూ. 202.80 కోట్లు), సైరా నరసింహా రెడ్డి(రూ. 187.25 కోట్లు) టాప్ 10లో నిలిచాయి. ఇక దేవర పార్ట్ 1(రూ. 182.55 కోట్లు), పుష్ప పార్ట్ 1(రూ. 144.9 కోట్లు), గుంటూరు కారం (రూ. 132.00 కోట్లు), ఆచార్య(రూ. 131.20 కోట్లు) తర్వాతి స్థానాల్లో వరుసగా నిలవగా.. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం 15వ స్థానాన్ని దక్కించుకుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు