
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా "హరి హర వీరమల్లు". భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల నిన్న రాత్రి ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఖచ్చితంగా ఆయన సినిమా ఫస్ట్ ప్రీమియర్స్ కే చూడాలి అంటూ చాలామంది లేడీ ఫ్యాన్స్ కూడా థియేటర్స్ కి వచ్చారు. అయితే ఓ మహిళ పసిబిడ్డతో సినిమా చూడడానికి వచ్చారు .
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు ప్రీమియర్ షో చూసేందుకు ఒక మహిళ పసిబిడ్డతో థియేటర్ కి వచ్చారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఆమెను అరిచి మందలించి పంపించేశారు. గతంలో పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా ఇదే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందు నుంచి అక్కడ హై సెక్యూరిటీ పెట్టేశారు. ఈ క్రమంలోనే అక్కడ పసిబిడ్డతో సినిమా చూడడానికి వచ్చిన మహిళను మందలించి వెనక్కి పంపించారు . ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
"ఏమ్మా కామన్ సెన్స్ లేదా..? చంటి బిడ్డని ఎత్తుకొని సినిమాకి వచ్చావు . బుద్ధుందా..? ఏదైనా జరగరానిది జరిగితే" అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదు అక్కడ ఉండే పోలీసులు వెనక్కి పంపించడం పట్ల గ్రేట్ జాబ్ అంటూ పోలీసులను ప్రశంసించేస్తున్నారు . మనకు తెలిసిందే 2024 డిసెంబర్ 4న పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది . ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కోమాలోకి వెళ్లిన బాలుడు ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవల డిశార్జీ అయ్యారు . ఇప్పటికీ కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు . ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇలా ప్రీమియర్ షోస్ కి పిల్లలను తీసుకురావడం ఏంటి..?? అంటూ జనాలు మండిపడుతున్నారు..!!