
ఆడవాళ్ళ తమ కాళ్ల పై తాము నిలబడాలి అని ఒకరిపై డిపెండెంట్ అవ్వకూడదు అని సమంత ఎప్పుడు చెప్పుకొస్తూ ఉంటుంది . ఆ మాటలు ఆడవాళ్లను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. చాలామంది సమంతనే మా ఇన్స్పిరేషన్ అంటూ సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పుకొస్తూ ఉంటారు . ఇదిలా ఉండగా సమంత ప్రెసెంట్ రాజ్ నిడమూరుతో డేటింగ్ చేస్తుంది అని.. త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే నాగచైతన్యని పెళ్లి చేసుకున్న రోజే అనగా అక్టోబర్ ఆరవ తేదీన సమంత రాజ్ నిడమూరుతో పెళ్లి పీటలు ఎక్కబోతుందట.
వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వీళ్ళిద్దరూ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తెలుస్తుంది. కానీ దీనిపై రాజ్ నిడమూరు.. కానీ అదేవిధంగా సమంత కానీ అఫీషియల్ ప్రకటన చేయలేదు . ఇదే సమయంలో సమంత నాటీ వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది . సమంతకి వెన్నెల కిషోర్ - రాహుల్ ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోలేని విషయాలను వెన్నెల కిషోర్ - రాహుల్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది . తాజాగా రాహుల్ - రష్మిక మందన్నా నటిస్తున్న సినిమా "గర్ల్ ఫ్రెండ్".
ఈ మూవీ నుంచి ఇటీవల ఒక సాంగ్ విడుదలైంది . అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది . ఆ సాంగ్ లోని ఒక హుక్ స్టెప్ ను వెన్నెల కిషోర్ తో కలిసి చేసింది. అంతే ఈ వీడియో సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ పాటలా ఉంది అని సమంత రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి అని ..సమంత ఏ పాటనైనా తనకు తగ్గట్టు మలిచేసుకుంటుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఇక యధావిధిగా సమంత అంటే పడని వాళ్ళు ఇందులో ద్వంద అర్ధాలు వెతుకుతున్నారు. సమంత మంచి రొమాంటిక్ మూడ్ లో ఉందని కొందరు అంటుంటే .. మరి కొందరు రెండో పెళ్లి చేసుకోబోతుంది కదా ఆ మాత్రం హుషారు ఉంటుందిలే అంటూ వల్గర్ గా చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో వెన్నెల కిషోర్ తో సమంత చేసిన హుక్ స్టెప్ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!