సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అని చెప్పే హీరోయిన్లు ఎంతమంది ఉన్నారో వేళ్ళతో లెక్కపెట్టలేం. చాలామంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ అనుభవాన్ని ఫేస్ చేసే ఉంటారు.అలా స్టార్ హీరోయిన్లు కూడా మేము అలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఫేస్ చేశాము అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు పేర్లు బయట పెడితే మరి కొంత మంది పేర్లు బయట పెట్టకుండానే ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది నటీమణులు చెప్పే విషయాలను బట్టి వాళ్లను అలా టార్చర్ చేసిన వాళ్ళు ఎవరో సోషల్ మీడియా జనాలు గుర్తుపట్టేస్తూ ఉంటారు.

 అయితే సీనియర్ నటి అయినటువంటి నయనతార ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయినో చెప్పనక్కర్లేదు.కానీ ఒకప్పుడు ఈమె కూడా చిన్న హీరోయినే. సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ స్టార్ హీరొయిన్ గా మారింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార కి ఒక చేదు అనుభవం ఎదురయిందట.. అది ఎంత పెద్ద చేదు అనుభవమో నోటితో చెప్పలేనంతగా. ఇక అసలు విషయంలోకి వెళ్తే..నయనతార సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఎందుకంటే కొన్ని సినిమాల్లో పాత్ర నచ్చక వదులుకుంటే మరికొన్ని సినిమాల్లో దర్శక నిర్మాతల బిహేవియర్ నచ్చక వదులుకుందట.

ఇక మొదట్లో ఆమెని ఓ స్టార్ నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి తన ఆఫీసుకు రమ్మని సినిమా స్టోరీ మొత్తం రివీల్ చేశాక తనతో ఒక నైట్ పడుకుంటే ఈ సినిమాలో హీరోయిన్ నువ్వే అంటూ పెద్ద బాంబు పేల్చాడట.అయితే ప్రముఖ నిర్మాత నుండి ఇలాంటి మాటలు వినడంతో నయనతార ఫ్యూజులు ఎగిరిపోయాయట.. దాంతో పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది అని ఆనందపడ్డ నయనతార కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయట.ఇక ఆ నిర్మాత ఆఫర్ ని మొహం మీదే రిజెక్ట్ చేసి నీలాగా నువ్విచ్చే ఆఫర్ల కోసం దొంగదారిలో ఎదగాల్సిన అవసరం లేదు. నేను నా సొంత టాలెంట్ తో ఎదుగుతా అంటూ నిర్మాతను అవమానించి మరీ ఇంటికి వచ్చేసిందట. ఇక ఈ విషయాన్ని నయనతార ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: