
కొంత కాలం క్రితం తమిళ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ "గోట్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదట త్రిష పాత్ర కోసం అనుష్క ను సంప్రదించారట. అందులో భాగంగా ఆమెకు కథను కూడా వివరించారట. కానీ ఈమె ఆ సినిమాలో నటించను అని చెప్పిందట. దానితో గోట్ సినిమాలో అనుష్కను అనుకున్న పాత్రకు గాను త్రిష ను సంప్రదించగా ఆమె మాత్రం ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ ద్వారా త్రిష కు మంచి గుర్తింపు కూడా వచ్చింది . అలా అనుష్క రిజెక్ట్ చేసిన పాత్ర ద్వారా త్రిష కు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది.