గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది . అది కూడా పవన్ చెప్పిందే.  "నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను".. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతుంది . అయినా మనం మన రెగ్యులర్ లైఫ్ లో ఈ డైలాగ్ వాడుతూనే వస్తూ ఉంటాం . అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నమాట నిజమైంది.  పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు . హరిహర వీరమల్లు సినిమాతో మరొకసారి అది ప్రూవ్ అయ్యింది.  పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించినా ఈ సినిమాకి ఏ ఎం రత్నం దర్శకత్వం వహించారు .


సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  సినిమాలోని ప్రతి డైలాగ్ బాగా ఆకట్టుకుంది . కాగా ఈ సినిమా అసలు హిట్ అవుతుంది అని ఎవరు ఊహించలేకపోయారు . దానికి కారణం సినిమాకి ప్రమోషన్స్ లేకపోవడమే . సరిగ్గా సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసిన ఒక నాలుగైదు రోజుల నుంచి సినిమా ప్రమోషన్స్ పై గట్టిగా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్ . అంతకు ముందు వరకు సినిమా అంటే ఏదో కత్తులతో నరుక్కునే మూవీ అనే అభిప్రాయం ఉండేది. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాక టోటల్ సీన్ మారిపోయింది .



ఒకే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హరిహర వీరమల్లు కొత్త ట్రెండ్ సృష్టించింది . సినిమాలో ఎటువంటి వల్గర్ సీన్స్ లేకపోయినా అసభ్యకర సీన్స్ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది మంచి కలెక్షన్స్ రాబడుతుంది అంటూ ప్రూవ్ చేసింది ఈ మూవీ.  ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద హీరోలు తమ సినిమాల్లో వల్గర్ అండ్ చీప్ సీన్స్ ఉండకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట .



మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమాలో ఎలాంటి హద్దులు మీరిన సీన్స్ చూస్తున్నామో. అందరికీ తెలిసిందే.  పైగా సాంగ్స్ లో కూడా రకరకాల హాట్ సీన్స్ పెట్టి గబ్బు లేపుతున్నారు కొంతమంది మూవీ మేకర్స్ . అయితే హరిహర వీరమల్లు సినిమా మాత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎక్కడ అసభ్యకర సీన్స్ లేనే లేవు . అయిన  సినిమా హిట్ అయ్యింది.  ఇదే బిగ్ ఎగ్జాంపుల్ గా తీసుకొని హరిహర వీరమల్లు సినిమా లో చేసినట్లే మిగతా సినిమాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సినీ స్టార్స్ . చూడాలి మరి ఈ కొత్త నిర్ణయం సినీ ఇండస్ట్రీకి ఎంతలా కలిసి వస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: