తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే అభిమానులు ఎంత ఎక్సైట్ మెంట్ తో వెయిట్ చేస్తూ ఉంటారో.. ఎంత హంగామా చేస్తూ ఉంటారు అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . అయితే కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ హీరో సినిమాలు ప్రమోట్ చేసేందుకు రకరకాల పద్ధతులని ఫాలో అవుతూ ఉంటారు . తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పని ఆస్ట్రేలియా వాసులను గజగజ వణికించేలా చేసింది .


దెబ్బకి ఇళ్లలోకి పరుగులు పెట్టేశారు . సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే ఎన్టీఆర్ నటించిన వార్ 2 మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది . ఆగస్ట్ 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశారు  మూవీ మేకర్స్. ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది . ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కూడా వేరే లెవెల్ లో ఉంది . ఈ క్రమంలోనే  ఎన్టీఆర్ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఆస్ట్రేలియాలో ఉండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాశంలో వార్ 2 అని రాశారు .



అయితే మన తెలుగు జనాలకి వార్ 2 అంటే ఎన్టీఆర్ మూవీ అని కొంచెం అవగాహన ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా వాసులకు వార్ 2 అనగానే ఏదో వార్ రాబోతుంది ఇదేవిధంగా హింట్ ఇచ్చారు అధికారులు అంటూ భయపడిపోయారు . గత కొన్ని నెలలుగా  చూసుకుంటే పలు దేశాల మధ్యయుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే . ఇలాంటి మూమెంట్లోనే వార్ 2 అని ఆకాశంలో రాసి ఉండడంతో అది చూసిన ఆస్ట్రేలియా జనాలతో పరుగులు తీశారు.  ఓ ఆస్ట్రేలియా వాసి ఆకాశంలో వార్ 2 అని రాసిన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "దీని అర్థం ఏంటి ..?" అంటూ ట్విట్ చేశారు . దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్ రిప్లై ఇస్తూ "మా అభిమాన హీరో ఎన్టీఆర్ కొత్త సినిమా వార్ 2 ని ప్రమోట్ చేసేందుకు ఇలా ప్రేమ చూపించమంటూ చెప్పుకొచ్చాడు".  దీనిపై మళ్లీ ఆ నెటిజన్ స్పందించాడు . "సడన్గా ఆకాశంలో వార్ 2 అని రాస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి" అంటూ తన భయాన్ని భయపెట్టారు . సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: