
ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే శృతిహాసన్ కి అసలు కెరీరే ఉండకపోయేది. అయితే అలాంటి హిట్ సినిమాలో నటించిన శృతిహాసన్ ఆ మూవీ నిర్మాత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. శృతిహాసన్ మాట్లాడుతూ.. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోలకి ఇస్తారు.కానీ సినిమా ఫ్లాఫ్ అయితే ఆ నింద హీరోయిన్ ల మీద వేస్తారు. నేను టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో నన్ను ఐరన్ లెగ్ హీరోయిన్ గా మార్చేసారు. కానీ నా కాలు నా దగ్గరే ఉండనివ్వండి. నా మీద ప్రశంసలు గానీ విమర్శలు గానీ వద్దు. ఇక పవన్ కళ్యాణ్ గారితో నటించిన గబ్బర్ సింగ్ మూవీలో నాకు హీరోయిన్ ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేసాను.
అయితే ఈ సినిమా కోసం నన్ను తీసుకున్న తర్వాత నిర్మాత బండ్ల గణేష్ నన్ను వద్దని చెప్పారట. ఎందుకంటే ఇప్పటికే ఈ హీరోయిన్ కి రెండు ఫ్లాప్ లు వచ్చాయి. ఫ్లాప్ ల్లో ఉన్న హీరోయిన్ ని మన సినిమా కోసం తీసుకోవడం ఎందుకని నన్ను తీసేయమని చెప్పారట.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ నీకు ఫ్లాప్ సినిమాలు పడలేదా.. ఎందుకు ఆ హీరోయిన్ ని అలా అంటున్నారు. మన సినిమాలో శృతిహాసనే హీరోయిన్. ఇది ఫిక్స్ అని అన్నారట.ఆరోజు పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో ఆ మాట అనకపోయి ఉంటే నేను గబ్బర్ సింగ్ సినిమాలో చేసి ఉండేదాన్ని కాదు నన్ను తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకునేవారు.. అంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టింది శృతిహాసన్.
అలా గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం రావడం తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పింది. ఇక శృతిహాసన్ ధనుష్ కాంబోలో వచ్చిన త్రీ మూవీ విడుదలైన సమయంలో డిజాస్టర్ అయింది.కానీ ఈ సినిమా ఇప్పుడు విడుదలయితే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని,వై దిస్ కొలవరి పాట కంటే ఈ సినిమానే బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమా ప్లాప్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అంటూ చెప్పింది.