
ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్.. ఇవన్నీ సరైన మోతాదులో ఉండేలా సమంత తన డైట్‌ను ప్లాన్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ ఫాలో అయ్యేది యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్. మూడు పూటలా తింటుంది. కానీ తక్కువ మోతాదులో నాణ్యమైన ఆహారం తింటుందట. బ్రేక్‌ఫాస్ట్ లో స్మూతీలు తీసుకుంటుదట. లంచ్ లో కూరగాయలు, ఆకుకూరలు తప్పనిసరి. కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బ్రోకలీ వంటివి ఆమె ఎక్కువగా తింటుంది.
పాలకూర, కేల్ సమంతకు అస్సలు నచ్చవు. సో.. వాటిని కంప్లీట్ గా ఎవైడ్ చేస్తుందట. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ లో ముఖ్యమైన సెలరీ, అకాయ్ బెర్రీస్, ఆవు నెయ్యి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, పసుపును సమంత తన డైలీ డైట్‌లో ఉండేలా చూసుకుంటుంది. వాటర్ కూడా ఎక్కువగా తాగుతుంది. తనను హెల్తీగా, ఫిట్‌గా ఉంచే ఆహారాలు ఇవేనని సమంత పేర్కొంది.
అన్నట్లు చీట్ డే కాన్సెప్ట్‌కు సమంత వ్యతిరేకం. వారంతా డైట్ ఫాలో అయ్యి.. ఒక్క రోజు ఇష్టమైన ఆహారం తినడమే చీట్ డే. కానీ సమంత మాత్రం రోజూ ఒకే రొటీన్ ఫాలో అవుతుంది. భోజనాన్ని ప్రతిరోజూ ఒకేలా తీసుకుంటుందట. అలాగే షూటింగ్స్ అప్పుడు అవుట్‌డోర్ వెళ్లిన కూడా డైట్ ప్రకారం సమంత ఏ టైమ్ కు ఏం తింటుందో ఆమె అసిస్టెంట్ కుక్ చేసి అందిస్తాడట. నా డైట్ ను సక్రమంగా ఫాలో అవ్వడంలో నా అసిస్టెంట్ నాకు చాలా సహాయపడతాడని సమంత పేర్కొంది.