హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం కింగ్డమ్. ఈ చిత్రం ఈనెల 31న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ,సాంగ్స్ అన్ని కూడా భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ట్రై చేయని ఒక కొత్త జోనర్ తో ఈ సినిమా లో కనిపించబోతున్నారు. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది.


ట్రైలర్ విషయానికి వస్తే..విజయ్ దేవరకొండ ఇందులో ఒక పోలీస్ గా కనిపిస్తున్నారు..ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అధికారులు విజయ్ దేవరకొండ ని ఎంచుకుంటారు. అండర్ కవర్ స్పై గా మారాలంటు అధికారులు ఆదేశాలను జారీ చేస్తారు. కానీ విజయ్ దేవరకొండ వెళ్లే ప్లేస్ చాలా కఠినంగా, గోరంగా, మనసులు ఉండలేని ప్రాంతంలో వెళ్లాల్సి ఉంటుంది. అప్పటినుంచి ట్రైలర్లో ఊహించని ట్విస్టులు కూడా కనిపిస్తాయి. నటుడు సత్యదేవ్ కూడా ఇందులో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య బాండింగ్ కూడా హైలెట్గా చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ అద్భుతంగా అందించారు.


అలాగే హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. యాక్షన్స్ సన్ని వేషాలతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ తో హైప్ తీసుకువచ్చారు. గుండుతో విజయ్ దేవరకొండ చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నారు. అలాగే డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా చెప్పిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ  కూడా ఈ చిత్రంపై ధీమాతో కనిపిస్తున్నారు. మరి కింగ్డమ్ సినిమాతో తన స్టామినను విజయ్ దేవరకొండ నిరూపించుకుంటారేమో చూడాలి మరి. ప్రస్తుతం ట్రైలర్ అయితే అదిరిపోయేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: