ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి తన అద్భుతమైన మ్యూజిక్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలను హిట్ అయ్యేలా చేశారు. ఈయన అందించిన మ్యూజిక్ తో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా ఒక సినిమా బాగుండాలంటే నటీనటుల యాక్టింగ్ కథతో పాటు మ్యూజిక్ కూడా బాగుండాలి.బ్యాగ్రౌండ్ మ్యూజిక్,పాటలు అన్నీ బాగుంటేనే సినిమాని ఆదరిస్తారు. ఒకవేళ కథ యాక్టింగ్ అన్నీ బాగుండి పాటలు బాలేకపోతే అది సినిమాకు మైనస్ అవుతుంది. అందుకే దర్శకనిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ఆచితూచి అడుగేస్తారు. అలా ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన ఘనత ఎంఎం కీరవాణికి ఉంది. 

అయితే అలాంటి కీరవాణిని విశ్వంభర చిత్ర యూనిట్ అవమానించింది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.దానికి కారణం సినిమా మొత్తానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తే ఒక స్పెషల్ పాట కోసం మాత్రం మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారు.దీంతో చాలా మంది నెటిజన్స్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణికి ఆ స్పెషల్ సాంగ్ కి మ్యూజిక్ అందించడం రాదా.. సినిమా మొత్తానికి ఆయన తీసుకొని ఆ స్పెషల్ పాట కోసం ఎందుకు వేరే వ్యక్తిని తీసుకున్నారు అంటూ సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతుంది. అయితే విశ్వంభర మూవీలో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ చిరంజీవితో స్టెప్పులు వేస్తున్నట్టు ఒక వార్త వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పాట కోసం చిత్ర యూనిట్ భీమ్స్ సిసిరోలియోని తీసుకున్నారు. దీంతో కీరవాణిని అవమానించినట్టు థంబ్ నెయిల్స్ క్రియేట్ చేసి ఏదేదో వార్తలు రాసేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ట. మేం కీరవాణి గారిని అవమానించలేదు.మాకు అలాంటి ఉద్దేశం లేదు.కీరవాణి గారు చెబితేనే వేరే వాళ్ళని తీసుకున్నాము. చిరంజీవి మౌని రాయ్  కాంబోలో వస్తున్న పాట కోసం భీమ్స్ సిసిరోలియోని తీసుకోవడానికి కారణం కీరవాణి ఆ సమయంలో హరిహర వీరమల్లుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఆయన చెప్పడం వల్లే వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నాం. ఇందులో ఆయన్ని కించపరిచినట్టు ఏ మూలనా లేదు.

చాలామంది కావాలనే కొన్ని థంబ్ నెయిల్స్ క్రియేట్ చేసి రూమర్లు రాస్తున్నారు. ఇక చిరంజీవి మౌని రాయ్ కాంబోలో రాబోతున్న స్పెషల్ సాంగ్ రగులుతోంది మొగలి పొదా, ఆట కావాలా పాట కావాలా వంటి  పాటలను మిక్స్ చేసి తీస్తున్నారని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇది ఫ్రెష్ సాంగ్. దేన్ని రీమేక్ చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు దర్శకుడు వశిష్ట. అలాగే సినిమా సెప్టెంబర్ 25న వస్తుంది అనే ప్రచారంలో కూడా ఎలాంటి నిజం లేదు అని,సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం పూర్తయ్యాక ఎప్పుడు రిలీజ్ అవుతుందో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకోచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: