త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా అంటే కచ్చితంగా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది . ఒక స్టైల్ ఫాలో అవుతూ ఉంటాడు. మిగతా డైరెక్టర్లు తమకి నచిన కాన్సెప్ట్ తెరకెక్కించేస్తారు . కానీ త్రివిక్రమ్ అలా కాదు ఆయన సినిమా తెరకెక్కించే విధానాన్ని ఒకపక్క షెడ్యూల్లో తీసుకెళ్తాడు . పూర్తి సెంటిమెంట్ ఆధారంగానే ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు.  ఏ రోజున పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి ..ఏ రోజున సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి .. ఎప్పుడు మ్యూజిక్ రిలీజ్ చేయాలి ..ఎప్పుడు ప్రీ రిలీజ్ పెట్టాలి .. ఏ సినిమా తేదీన రిలీజ్ చేయాలి ..ఇవన్నీ కూడా సెంటిమెంట్ ఆధారంగానే ముందుకు వెళుతూ ఉంటాడు.
 

ఆ కారణంగానే ఆయన సినిమాలో ఎక్కువగా పదే పదే మనం రిపీటెడ్ నటీనటులను చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తెరకెక్కించే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే . మొదటి హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ ఇంకా హైలైట్ అయిపోతూ ఉంటుంది . అలా రాస్తూ ఉంటాడు కథలు త్రివిక్రమ్ శ్రీనివాసరావు.  కాగా తనదైన స్టైల్ లో స్టైలిష్ గా టేకింగ్ ..హెల్తి కామెడీతో అద్భుతమైన డైలాగులు రాసే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రొటీన్ కి భిన్నంగా నటీనటులను చూపిస్తూ ఉంటాడు .



అన్ని వర్గాల ప్రేక్షకులను ఆయన తెరకెక్కించే సినిమాలు అలరిస్తూ ఉంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన "జులాయి, అతడు, అత్తారింటికి దారేది .సన్నాఫ్ సత్యమూర్తి ,అలా వైకుంఠపురం " మంచి హిట్స్ గా బాక్సాఫీస్ వద్ద నిలిచాయి . గుంటూరు కారం సినిమాపై నెగిటివ్ టాక్ వినిపించిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది . కాగా ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో ఓ వ్యక్తి మనకి కామన్ గా కనిపిస్తూ ఉంటాడు . ఆయన పేరే పమ్మి సాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటించి మంచి పేరు దక్కించుకున్నారు.



ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలో పమ్మి సాయి ఎక్కువగా కనిపిస్తాడు . పమ్మీ సాయి "అతడు" సినిమాలో (గ్లాస్ మార్చండి రా..) అనే  పాపులర్ డైలాగులో కనిపిస్తాడు . ఇక జల్సా , ఖలేజా , జులాయి వంటి సినిమాలల్లో కూడా నటించాడు. "నేను 12 కొట్టాను అరుస్తున్నానా.." అని జూలాయి లో చెప్పే డైలాగ్ బాగా హిట్ అయ్యింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వం చేసిన 11 సినిమాలలో 10 సినిమాలలో పమ్మి సాయి ఉంటాడు. అయితే పమ్మిసాయికి త్రివిక్రమ్ దూరపు బంధువు అంటూ కూడా తెలుస్తుంది . మంచి పరిచయం ఉంది.. టాలెంట్ ఉంది అని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారట.  వెంకటేష్ సినిమాలో కూడా ఆయన కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: