
మహేష్ బాబు కోసం తన కెరీర్ ని వదిలేసింది అని .. ఆ తర్వాత అంతలా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నింది మాత్రం లక్ష్మీ ప్రణతి అని ఆమెని చూసి మిగతావాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెపుతూ ఉంటారు. లక్ష్మి ప్రణతికి ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి. కానీ పెళ్లి తర్వాత ఫ్యామిలీయే తన ప్రపంచం అనుకోని అన్ని వదిలేసింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కాగా లక్ష్మీప్రణతి బయట పెద్దగా కనిపించరు . కనిపించిన మాట్లాడరు . సింపుల్ గానే ఉంటారు . అలాంటి లక్ష్మీ ప్రణతి ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో తన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
అందరూ అనుకున్నట్టే ఆమె ఫేవరెట్ హీరో తారక్. కానీ తారక్ కాకుండా ఇండస్ట్రీలో ఆమె ఎక్కువగా ఇష్టపడి చూసే సినిమాలు ఎవరివి అంటే మాత్రం ప్రభాస్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు నటించిన సినిమాలు ఎక్కువగా చూసేదట. ఆయన అంటే మొదటి నుంచి స్పెషల్ గౌరవం. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటన పర్ఫామెన్స్ బాగుంటుంది అని ..ఆ తర్వాత అంతగా లైక్ చేసి చూసే సినిమాలు ప్రభాస్ నటించిన మూవీస్ నే అంటూ చెప్పుకొచ్చిందట. కేవలం ఆమె కి మాత్రమే కాదు. నందమూరి ఫ్యామిలీలో చాలా మందికి ప్రభాస్ అంటే ఇష్టం. తారక్ పెద్ద కొడుకుకి కూడా ప్రభాస్ అంటే ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కాగా ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా ప్రశాంత్ నీల్ తో తెరకెక్కే సినిమా షూట్ లోను బిజీబిజీగా గడిపేస్తున్నారు. .